యూరప్‌లో ఫ్రిజ్‌లపై సైబర్ దాడులు..
Supermarket Fridge Hacking: యూరప్ దేశాల్లో ఫ్రిజ్‌లు హ్యాక్ అవడం సంచలనంగా మారింది. సూపర్ మార్కెట్లలో ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలు రిమోట్‌గా మార్చిన హ్యాకర్లు. దీంతో టన్నుల కొద్దీ ఆహార పదార్థాలు పాడైపోయాయి. కోట్లాది రూపాయల నష్టం జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Supermarket Fridge Hacking: సైబర్ దాడులంటే ఇప్పటివరకు మనకు గుర్తుకొచ్చేవి బ్యాంకు ఖాతాలు, వెబ్‌సైట్లు, కంప్యూటర్లు, వ్యక్తిగత డేటా చోరీ. కానీ ఇప్పుడు హ్యాకర్లు తమ దాడుల పరిధిని మరింత విస్తరిస్తున్నారు. యూరప్‌లో ఏకంగా సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాటి ఉష్ణోగ్రతలను రిమోట్‌గా మార్చి, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పనికిరాకుండా చేస్తున్నారు. యూరప్‌లో కేవలం మూడు వారాల వ్యవధిలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
500కు పైగా సూపర్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం
యూరప్‌లోని సూపర్ మార్కెట్లలో పాలు, పెరుగు, మాంసం, చేపలు, కూరగాయలు వంటి త్వరగా పాడయ్యే వస్తువులను నిర్దిష్ట ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తారు. వీటి కోసం ప్రత్యేకమైన శీతలీకరణ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. అయితే ఇంటర్నెట్‌కు అనుసంధానమైన ఈ పరికరాల నియంత్రణ వ్యవస్థల్లోని లోపాలను హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఫ్రాన్స్‌లో అక్టోబర్ 11, 12 తేదీల మధ్య జరిగిన సైబర్ దాడుల్లో 500కు పైగా సూపర్ మార్కెట్లు ప్రభావితమయ్యాయి. ఇంటర్‌మార్షే, క్యారీఫోర్ వంటి ప్రముఖ రిటైల్ సంస్థల దుకాణాల్లోని శీతలీకరణ యంత్రాల ఉష్ణోగ్రతలను హ్యాకర్లు పెంచారు. కొన్ని పరికరాల్లో ఉష్ణోగ్రత ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఉదయం దుకాణాలు తెరిచే సమయానికి ఫ్రిజ్‌లలోని ఆహార పదార్థాలు పాడైపోయాయి. బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉండటంతో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల ఉత్పత్తులను పడేయాల్సి వచ్చిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే వేల కోట్ల యూరోల నస్టం వాటిల్లినట్లు ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.
Happening across Europe. Hackers are hitting supermarket refrigeration systems: 50°C in the freezers, everything trashed. Empty shelves in France, Belgium, Luxembourg, Sweden, Netherlands, Poland, Ireland, Finland and Estonia. France was hit first. This is a hybrid attack on the food supply chain.
— RadioGenoa (@RadioGenoa) November 3, 2026
ఏడు దేశాలకు విస్తరించిన దాడులు
యూరప్‌లో మళ్లీ ఫ్రిజ్‌లపై ఇలాంటి దాడులు జరిగాయి. బెల్జియంలోని మోన్స్ నగరంలో ఐకియా దుకాణానికి చెందిన క్యాంటీన్‌లో ఈ సమస్య మొదలై, స్వీడన్, లక్సెంబర్గ్, ఐర్లాండ్ తదితర దేశాల్లోని స్టోర్లకు విస్తరించింది. బెల్జియంలోని క్యారీఫోర్ సంస్థకు చెందిన 700 షాపింగ్ మాల్స్‌లో 15 స్టోర్లు ఈ దాడితో ప్రభావితమైనట్లు సంస్థ తెలిపింది. ఇది సాధారణ సాంకేతిక సమస్య కాదని, సైబర్ దాడేనని స్పష్టం చేసింది. ఈ ఘటనలోనూ భారీ మొత్తంలో ఆహార పదార్థాలను పారబోయాల్సి వచ్చింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఇంటర్నెట్‌కు అనుసంధానమైన ఫ్రిజ్‌లలోని పాత ఫర్మ్‌వేర్‌లో ఉన్న లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఫర్మ్‌వేర్ అంటే ఒక పరికరం ఎలా పనిచేయాలో నియంత్రించే అంతర్గత సాఫ్ట్‌వేర్. దీనిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయకపోతే హ్యాకర్లు పరికరాల నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఈ తరహా దాడులు భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పాత సాఫ్ట్‌వేర్‌లో ఉన్న భద్రతా లోపాలను వెంటనే సరిచేయాలని, సంస్థలు తమ పరికరాల ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని సూచించింది.
ఆహార సరఫరా వ్యవస్థలకూ సైబర్ ముప్పు
సైబర్ దాడులు కేవలం ఆహార నిల్వ వ్యవస్థలకే పరిమితం కావడం లేదు. గతంలో బ్రిటన్‌లోని మార్క్స్ అండ్ స్పెన్సర్ వంటి రిటైల్ సంస్థలు కూడా రాన్సమ్‌వేర్ దాడులకు గురయ్యాయి. ఇప్పుడు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే రాన్సమ్‌వేర్ దాడులు 2028 నాటికి కీలక మౌలిక సదుపాయాలకు పెద్ద ముప్పుగా మారవచ్చని NCSC అంచనా వేస్తోంది. సాధారణంగా హ్యాకర్లు డబ్బు కోసం కంప్యూటర్లలోని సమాచారాన్ని లాక్ చేసి, తిరిగి అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారు. కానీ ఫ్రిజ్‌లను నియంత్రించడం ద్వారా ఆహార నిల్వ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు. ఒక ఫ్రిజ్‌పై జరిగే దాడి కూడా చివరకు ఆహార సరఫరా, వ్యాపారం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ దాడులకు తామే కారణమని ఎవరూ ప్రకటించుకోలేదు. దీంతో ఈ హ్యాకింగ్‌పై యూరోపియన్ యూనియన్‌తో పాటు అమెరికా కూడా దర్యాప్తు చేస్తోంది. యూరప్‌పై ఆగ్రహంతో ఉన్నవారే ఈ దాడులకు తెగబడి ఉండొచ్చని భావిస్తున్నారు.



