MLA Vemula Veeresham Accident

తెలంగాణ ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. వీరేశం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వెనకనుంచి మరో కారు ఢీ కొట్టింది. దీంతో ముందు వెళ్తున్న ఎస్కార్ట్‌ వాహనాన్ని వీరేశం కారు ఢీ కొట్టింది. నకిరేకల్‌ నుంచి చినకాపర్తికి వెళ్తుండగా కట్టంగూరు మండలం అన్నారం దగ్గర ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం తన కాన్వాయ్‌తో కలిసి ప్రయాణిస్తుండగా అన్నారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వీరేశంకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఎమ్మెల్యే కారు ముందు, వెనుక కొంతభాగం ధ్వంసమైంది. వెంటనే అలర్ట్ అయిన ఎస్కాట్ ఎమ్మెల్యేను మరోకారులో అక్కడి పంపించి వేశారు. నుంచి వెళ్లిపోయారు. ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకోవడంతో పాటు సిబ్బంది సమయస్ఫూర్తి వల్ల వేముల వీరేశం ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రమాదం వార్త తెలియగానే ఆయన అనుచరులు, నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.