HomeLifestyleHealthరిఫ్రిజిరేటర్ లో పాలు ఎక్కడ పెట్టాలి?

రిఫ్రిజిరేటర్ లో పాలు ఎక్కడ పెట్టాలి?

Published on

ఈరోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదనే చెప్పాలి. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న చాలా మంది కూరగాయలు మొదలుకుని ఉప్పు నుంచి పప్పు వరకూ మొత్తం అందులోనే పెడుతుంటారు. ఏ వస్తువైనా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని ఎక్కువ మంది భ్రమ పడుతుంటారు.కానీ కొన్నిసార్లు తెలీక చేసే పొరపాట్ల వల్ల ఖరీదైన ఆ వస్తువులు పాడవుతాయి. ప్రధానంగా పాల ప్యాకెట్ల విషయంలో ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటారు. పాలను ప్రిడ్జ్‌లో ఎక్కడ స్టోర్ చేయాలనేది చాలామందికి తెలీదు. ఈ విషయంలో పెద్ద తప్పులు చేస్తుంటారు. అసలు పాలను ఫ్రిడ్జ్‌లో ఏ ప్రాంతంలో ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయో తెలుసా మీకు.

ఫ్రిడ్జ్ లో పాలు, పెరుగు, ఉప్పు, పప్పు ఇలా ప్రతి ఒక్కటీ పాడవకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. ఉదయం పాల ప్యాకెట్లు తెచ్చుకోగానే.. అవసరమైనంత వాడుకుని మిగిలిన పాలను ఫ్రిడ్జ్‌లో ఉంచుతుంటారు. ఇలా మరుసటి రోజు కూడా వాటిని వాడుకుంటుంటారు. అయితే ఈ విషయంలో చాలా మంది తప్పు చేస్తుంటారు.సాధారణంగా ఎవరైనా ఫ్రిడ్జ్ డోరు తెరిచి పక్కనే ఉన్న అరల్లో పెట్టేస్తుంటారు. కానీ ఇలా ఉంచడం వల్ల పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండే అవకాశం ఉండదు.

ఎందుకంటే చీటికీ మాటికీ ఫ్రిడ్జ్ డోరు తెరుస్తుంటాము కాబట్టి.. లోపలి చల్ల గాలి బయటికి వెళ్లిపోతుంది.చల్లదనంలో హెచ్చుతగ్గుల కారణంగా పాలల్లో బ్యాక్టీరియా చేరుతుంది. తద్వారా త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా పాలను బయట నిల్వ చేస్తే.. కేవలం 8గంటల పాటు మాత్రమే తాజాగా ఉంటాయి. అలాగే అరటిపండ్లు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. జామ, కివీస్, మామిడి, సీతాఫలాలు,బొప్పాయి, పీచెస్, బేరి, ఖర్జూరం, రేగు పండ్లను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు.ఎందుకంటే అవి నిరంతరం పండే ప్రక్రియలో ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉంచితే వెంటనే వాటిలోని బలమైన పోషకాలు మాయమవుతాయి. అంతేకాదు అవి త్వరగా పాడయిపోతాయి. అలాగే టమోటాలను కూడా అదే పనిగా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో ఉంచకూడదని చెబుతున్నారు.

Latest articles

More like this