HomeLifestyleHealthకాకరకాయ చేసే మేలు

కాకరకాయ చేసే మేలు

Published on

మనలో చాలామందికి కాకరకాయ పేరు చెప్పగానే వద్దు అంటారు. అయితే, మన ఆరోగ్యానికి కాకరకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. కాకరకాయలో విటమిన్‌సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగాలు దరి చేరవు. ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. గాయాలు త్వరగా మానతాయి. విటమిన్‌ఎ కూడా అధికమొత్తంలో ఉండడంవల్ల చర్మ ఆరోగ్యం, కంటి చూపును మెరుగు పరుస్తుంది.ఇందులో కేలరీలు తక్కువపీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల కాకరకాయ తింటే మనకు రోజువారీ అవసరమైన ఫైబర్‌లో ఎనిమిది శాతం మనకు అందుతుంది. వీటితోపాటు జింక్‌, పొటాషియం, ఐరన్‌తదితర ఖనిజాలు కూడా కాకరలో సమృద్ధిగా ఉన్నాయి.షుగర్ వ్యాధి గ్రస్తులు కాకర తింటే అది నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.గర్భిణులు కాకరకు దూరంగా ఉండడం మంచిది.

Latest articles

More like this