ఫ్రాన్స్‌లో అల్లరిమూకల లూటీలు
France protests: జీవనవ్యయం విపరీతంగా పెరగడం, పాఠశాలల్లో కనీస వసతుల కొరత, నిధులకోతపై మొదలైన ఉద్యమం హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారుల ముసుగులో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇప్పటిదాకా ఫ్రాన్స్‌లో హింసకు కారణమైన 2400 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు

France Protests and Luxury Store Looting:
అల్లరిమూకల ఆగడాలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. ఆందోళనకారులు లూటీలకు తెగబడుతున్నారు. దుకాణాలకు నిప్పుపెడుతున్నారు. అల్లరి మూకలు ఫ్రాన్స్‌లో వందల దుకాణాలు, షోరూమ్‌లను దోచుకున్నాయి. దోచుకున్న వస్తువులను ఆన్‌లైన్ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్మకానికి పెడుతున్నారు. ఫ్రాన్స్‌లో ఆందోళనలు మొదలయ్యాక దాదాపు 1500 దుకాణాలను అల్లరి మూకలు లూటీచేశాయి. లగ్జరీ బ్రాండ్స్ లూయిస్ విటాన్, విర్మెస్, రోలెక్స్, యాపిల్, సెలిన్ సెఫోరా, బర్బెర్రీ షోరూమ్‌ల(France Protests and Luxury Store Looting)ను కూడా ఆందోళనకారులు దోచుకున్నాయి.
షోరూమ్స్‌ని లూటీచేసినవారు ఆ వస్తువనుల ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. ఫ్రాన్స్‌లోని పాపులర్ ఆన్‌లైన్ సెకండ్‌హ్యాండ్ వెబ్‌సైట్ వింటెడ్‌లో లగ్జరీ బ్యాగ్స్, వాచ్‌లు, ఫోన్లు అమ్మకానికి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. అనుమానాస్పద వస్తువులను తమ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విక్రయించకుండా ఆ సంస్థలే చొరవ తీసుకోవాలని ఫ్రాన్స్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మరోవైపు తమ స్టోర్లను కాపాడుకోవడానికి డియోర్‌లాంటి సంస్థలు ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంటున్నాయి.
జీవనవ్యయం విపరీతంగా పెరగడం, పాఠశాలల్లో కనీస వసతుల కొరత, నిధులకోతపై మొదలైన ఉద్యమం హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారుల ముసుగులో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇప్పటిదాకా ఫ్రాన్స్‌లో హింసకు కారణమైన 2400 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముసుగులు, మాస్క్‌లు ధరించి లూటీలు చేస్తున్నవారిని అదుపుచేయడం ప్రభుత్వ యంత్రాంగానికి కూడా కష్టమైపోతోంది. అల్లరి మూకల దాడుల్లో సుమారు వెయ్యిమందిదాకా పోలీసులు గాయపడ్డారు. కేవలం లూటీల(France Protests and Luxury Store Looting)కు తెగబడటమే కాకుండా ప్రభుత్వ భవనాలకు అల్లరి మూకలు నిప్పుపెడుతున్నాయి. ఫ్రాన్స్ లిమోజెస్ నగరంలోని 19వ శతాబ్దపు చారిత్రక సిటీ హాల్‌కి నిప్పంటించారు. సుమారు 8లక్షలమంది నిరసనల్లో పాల్గొన్నట్లు గుర్తించారు.
మంటలకు ఆజ్యంపోసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలున్నాయి. వలసలే ఫ్రాన్స్‌లో హింసకు కారణమంటున్నారు ట్రంప్. ప్రపంచం నలుమూలలనుంచి అందరినీ ఫ్రాన్స్‌కి తీసుకురావడమే ఈ పరిస్థితికి కారణమని నిందిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ని ఈ విషయంలో తాను చాలా కాలం క్రితమే హెచ్చరించానంటున్నారు. త్వరలోనే పారిస్ నగరం ముస్లిం నగరంగా మారిపోతుందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో అమెరికా కూడా ఫ్రాన్స్ అనుభవాలు చవిచూడాల్సి వస్తోందంటున్నారు ట్రంప్.



