మనదేశంలో కాసింత విరామం దొరికితే ఆలయాలకు, విహార ప్రదేశాలకు వెళ్ళడం చేస్తుంటాం. రెండుమూడు రోజులు సెలవులు లభిస్తే దగ్గర్లోని పుణ్యక్షేత్రాలకు వెళతారు. కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్‌లో కవర్చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. పనిలో పనిగా కేరళ ప్రకృతి అందాలనూ వీక్షించొచ్చు. ఇందు కోసం ఇండియన్రైల్వే కేటరింగ్అండ్టూరిజం కార్పొరేషన్(IRCTC) ‘సౌత్ ఇండియన్ టెంపుల్ రన్’ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆరు రాత్రులు, ఏడు పగళ్లు కొనసాగే ఈ టూర్‌కు నవంబర్1న ప్రయాణానికి విమాన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఉదయం 5:10 గంటలకు (6E 5367) విమానం బయల్దేరుతుంది. ఉదయం 6:50 గంటలకు తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుతారు. అక్కడ ముందుగానే బుక్‌చేసిన హోటల్లో బస ఉంటుంది. అల్పాహారం స్వీకరించాక నేపియర్మ్యూజియానికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం పూవర్ఐల్యాండ్చూడవచ్చు. ఇక సాయంత్రం అజిమాలా శివాలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత తిరువనంతపురంలోనే ఆ రాత్రి బస ఉంటుంది. రెండో రోజు ఉదయం అనంత పద్మనాభస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత టిఫిన్చేశాక కన్యాకుమారికి పయనమవుతారు. కన్యాకుమారిలో సూర్యాస్తమయాన్ని వీక్షిస్తారు. రాత్రి కన్యాకుమారిలోనే బస ఉంటుంది.
మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ ముగించాక నీటి మధ్యలో ఎంతో అందంగా నిర్మించిన రాక్ మెమోరియల్‌ను చూడటానికి వెళ్తారు. అనంతరం అక్కడ నుంచి ఐదారు గంటలు ప్రయాణించి రామేశ్వరం చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది. నాలుగో రోజు ఉదయం రామేశ్వరం, ధనుష్కోటిలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవచ్చు. అయితే రామేశ్వరంలోనికి బస్సుల అనుమతి ఉండదు. ఇతర ఆలయాలను సందర్శించటానికి ఐఆర్సీటీసీ ఎలాంటి ఏర్పాట్లు చేయదు. ఇతర రవాణా ఏర్పాట్లను ప్రయాణికులే సమకూర్చుకోవాలి. దానికయ్యే ఖర్చులూ యాత్రికులే భరించాల్సి ఉంటుంది. రామేశ్వరంలోనే రాత్రి బస ఉంటుంది. ఐదో రోజు ఉదయం అల్పాహారం స్వీకరించాక అక్కడ నుంచి నాలుగు గంటలు ప్రయాణించి తంజావూర్చేరుకుంటారు. అబ్దుల్‌కలాం మెమోరియల్చూసి బృహదీశ్వరాలయాన్ని దర్శించుకొని తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అక్కడ హోటల్లో ఆ రాత్రి ఉంటారు. ఆరో రోజు టిఫిన్చేసి శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం మధురై చేరుకుంటారు. అక్కడే హోటల్లో ఉంటారు. ఏడో రోజు ఉదయం అల్పాహారం అనంతరం మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి బస్సులో మధురై విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 గంటలకు (6E 6782) విమానంలో హైదరాబాద్‌కు పయనమవుతారు. 3:15 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో మీ ప్రయాణం ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీలో అనేక విషయాలు మనం గమనించాలి. హైదరాబాద్తిరువనంతపురం/ మధురై- హైదరాబాద్విమాన టికెట్లు ఉంటాయి. అందులో భాగంగా ఏడు రోజుల పాటు అల్పాహారం, ఆరు రోజుల పాటు రాత్రి భోజనం ఉంటుంది. పర్యాటక ప్రదేశాలు చూడడానికి వీలుగా ఏసీ బస్సును ఐఆర్‌సీటీసీనే ఏర్పాటు చేస్తుంది. టూర్ ప్యాకేజీలో ఉన్నవారికి ట్రావెల్ఇన్సూరెన్స్సదుపాయం ఖచ్చితంగా ఉంటుంది. ఐఆర్సీటీసీ టూర్ఎస్కార్ట్అందుబాటులో ఉంటారు.వీటిని యాత్రికులే చూసుకోవాలి. టూర్సమయంలో మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి. హైదరాబాద్ఎయిర్పోర్టుకు, ఎయిర్‌పోర్టు నుంచి వారి గమ్యస్థానాన్ని చేరుకోవటానికి యాత్రికులే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. విమానంలో ఆహారానికి యాత్రికులే చెల్లించాలి. చూడదగిన ప్రదేశాల్లో టికెట్ల ఖర్చు ప్రయాణికులే భరించాలి.వీరికి టూర్ గైడ్ అందుబాటులో ఉండరు. 75 ఏళ్లు పైబడిన వారు ప్రయాణించాలంటే కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఎస్కార్ట్‌గా నియమించుకోవాలి.
ప్యాకేజీ వివరాలలోకి వెళితే.. రూమ్‌లో సింగిల్ఆక్యుపెన్సీ అయితే ఒకరికి రూ.50,350, డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.37,650, ట్రిపుల్ఆక్యుపెన్సీ అయితే రూ.35,950 చెల్లించాలి. 5- 11 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు విత్బెడ్అయితే రూ.31,500; వితౌట్అయితే రూ.27,750
2- 4 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు రూ.20,350 చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఐఆర్సీటీసీ క్యాన్సిలేషన్పాలసీ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ప్రయాణానికి 21 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్చేసుకుంటే టికెట్మొత్తం ధరలో 30 శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం, 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును మీ టికెట్ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్క్యాన్సిల్చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు. మీ బడ్జెట్, మీ ఖాళీ టైంని పరిగణనలోకి తీసుకుని టూర్ ప్యాకేజీల గురించి ఆలోచించవచ్చు.