త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేసథ్యంలో మోడీ సర్కార్ రక్షాబంధన్ కానుకగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఉజ్వల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు 400వరకూ ధర తగ్గించింది. సాధారణ గ్యాస్ వినియోగదారులకు 200 వరకూ ఊరట నిచ్చింది. అయితే ఇక మిగిలింది డీజిల్, పెట్రోల్ ధరల తగ్గింపేనని అంతా అంటున్నారు. ఎన్నికల జిమ్మిక్కులు చేయడంలో మోడీ బాగా ఆరితేరారని, డీజిల్, పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గించి, ఇదంతా తమ ఘనతే అని చాటుకుంటారని అంటున్నాయి ప్రతిపక్షాలు. చమురు ధరలు తగ్గిస్తే వాటి ప్రభావం నిత్యావసరాలపై పడుతుందని, వాటి ధరలు తగ్గుతాయని సామాన్యులకు ఊరట లభిస్తుందని అంటున్నారు.
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి సానుకూలంగా ఉందని సిటీ గ్రూప్ తెలిపింది. వంట గ్యాస్ ధర తగ్గింపు నిర్ణయంతో ద్రవ్యోల్బణం తగ్గుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే మరింతగా ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగిరావచ్చని అంటున్నారు. 2023 చివరి నాటికి రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం దిగిరాక తప్పదని విపక్షాలు అంటున్నాయి.