యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆమె తాజాగా విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. బోరున ఏడుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో పై చర్చ రచ్చరచ్చగా సాగుతోంది. ఆన్లైన్లో నెగెటివిటీ వల్లే ఆమె కన్నీటిపర్యాంతమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇస్తూ అనసూయ మరో పోస్ట్ పెట్టింది. ‘‘నేను చేసినపోస్ట్ను చాలామంది బాగానే అర్థం చేసుకున్నారు. కొందరు మాత్రం మిస్ అండర్‌స్టాండ్ చేసుకున్నారు. వారికి అర్థం కాలేదో.. లేక పైపైనే చదివారో నాకు తెలియదు. మరోసారి చదువుకోండి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది నన్ను ఏ మాత్రం ప్రభావితం చేయదు. ఆ ట్రోల్స్‌కు బాధపడను. పబ్లిక్‌లో ఉన్నప్పుడు అవన్నీ సహజం. సోషల్ మీడియాలో జరిగే రాద్దాంతానికి నా ఫీలింగ్ ఏడుపుతో ఉండదు కోపంతో ఉంటుంది.
నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నా. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదనుకున్నా. నవ్వులు, సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే ప్రజెంట్ చేేస క్రమంలో మేము ఎంతో ఒత్తిడికి గురవుతాం. ట్రోలింగ్ వల్ల బాధపడే వీక్ పర్సన్ కాదు నేను’’ అని వివరణ ఇచ్చింది.
అయితే ఈ వీడియోపై కూడా అనసూయను ట్రోల్ చేశారు . తాజాగా వివరణ ఇచ్చిన వీడియోపై ట్రోలింగ్ జరుగుతోంది. పలువురు చేసిన ట్వీట్లకు అనసూయ సమాధానమిచ్చారు. ‘మీరు త్వరగా ఓ నిర్ణయానికి రాకుండా ఉండాల్సింది. ఊహాగానాలను హెడ్‌లైన్స్‌గా పెట్టకుండా ఉండాల్సింది. నేను పంచుకున్న సమాచారం అర్థం కాకపోతే రెండుసార్లు చదువుకోవాల్సింది. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం నేను ఈ పోస్ట్ పెట్టానని అంటున్నారు. మనం ఈ సోషల్ మీడియాలో ఉన్నది ఇతరుల అటెన్షన్ కోసం. నాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ నాకు అటెన్షన్ కావాలి’’ అని ట్వీట్లకు రిప్లై ఇచ్చింది అనసూయ. నిత్యం సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటుంది. కుటుంబంతో ఆమె వెకేషన్ కి వెళ్ళినా ఆ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలను షేర్ చేసినప్పుడల్లా ఆమె అభిమానులు కామెంట్లు చేస్తుంటారు. గతంలో ఆంటీ అంటూ ఆమెని సంబోధించడంతో ఆమె సీరియస్ అయిన సంగతి తెలిసిందే.