సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక నాయర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె పెళ్లికి సంబంధించి ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. కార్తీక నాయరే తన సోషల్ మీడియా వేదికగా తాజాగా తనకు కాబోయే రోహిత్ మీనన్ ఫొటోలను కార్తీక నాయర్ షేర్ చేసింది. అందులో తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించి.. తనకు నిశ్చితార్థం అయినట్లుగా వెల్లడించింది.తెలుగులో కార్తీక రంగం మూవీలో తొలిసారిగా కనిపించింది. . ‘రంగం’ మంచి బ్రేక్ కూడా ఇచ్చింది. టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ ఆ తర్వాత ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ మూవీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ‘‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్.. నీతో కలిసి నడవడానికి కౌంట్‌డౌన్ మొదలెట్టా..’’ అని తెలుపుతూ.. రోహిత్ మేనన్‌తో ఉన్న ఫొటోలను కార్తీక షేర్ చేసింది.ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.