HomeEntertainmentసలార్ మేకింగ్ వీడియో… సోషల్ మీడియాలో వైరల్

సలార్ మేకింగ్ వీడియో… సోషల్ మీడియాలో వైరల్

Published on

డార్లింగ్ ప్రభాస్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ‘సలార్’ ప్రేక్షకుల ముందుకి డిసెంబర్ 22 న వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్ కుమ్ముతున్నాయి. మూడు రోజులకు గాని ఈ సినిమా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.320 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిందని చెపుతున్నారు. సోమవారం కూడా సెలవు దినం కావటంతో ఈ సినిమాకి కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం వుందంటున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్వాహకులు ఈ చిత్రం యొక్క మేకింగ్ వీడియో ని ఈరోజు విడుదల చేశారు. ఇందులో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), శృతి హాసన్ (Shruti Haasan) అలాగే మిగతా నటులు వారి మీద తీసిన పోరాట సన్నివేశాలు అన్నీ ఒక చిన్న వీడియోలో పొందుపరచి విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు ప్రభాస్ అభిమానులని విపరీతంగా అలరిస్తోంది.ఈరోజు వరకు వచ్చిన కలెక్షన్స్ అదిరిపోయేట్టు వున్నాయి, అందుకని అలాంటివే ఇక ముందు కూడా ఉండాలని, ఆ సినిమాకి ఇంకా కొంచెం హైప్ ఇవ్వడానికి ఈ మేకింగ్ వీడియో ఈరోజు విడుదల చేసినట్టుగా కనపడుతోంది. తాము కోరుకున్న క్యారెక్టర్లో.. కావలసిన ఎలిమెంట్స్ తో వాళ్ల కథానాయకుడు వచ్చాడన్న సంతోషం ప్రతి డార్లింగ్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. సలార్ అందరి అంచనాలను తలకిందులు చేసింది. బ్లాక్ బస్టర్ అంటూ కలెక్షన్ల కనకవర్షం కురుస్తోంది. అందుకే వారికి ఆనందానికి హద్దే లేదు.

Latest articles

More like this