HomeEntertainmentబాలయ్య అన్ స్టాపబుల్ లో రణబీర్ కపూర్

బాలయ్య అన్ స్టాపబుల్ లో రణబీర్ కపూర్

Published on

నందమూరి బాలకృష్ణ ఓ ప్రైవేట్ ఓటీటీలో చేస్తున్న ప్రతిష్టాత్మక షో అన్ స్టాపబుల్ లో తాజాగా చేస్తున్న ఎపిసోడ్ సంచలనంగా మారుతోంది..ఈ షో సీజన్ 3 కూడా ప్రారంభమయింది. ఇందులో మొదటి ఎపిసోడ్ ‘భగవంత్ కేసరి’టీముతో బాలకృష్ణ చిట్ చాట్ చేశారు. రణబీర్ కపూర్ ,రష్మిక మందన్న జంటగా నటిస్తున్న హిందీ సినిమా ‘యానిమల్’ తెలుగులో కూడా విడుదల కానుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ టీం ‘అన్ స్టాపబుల్’ షో కి వస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్, బాలకృష్ణ కలిసి వున్న ఫోటోలు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతుతున్నాయి. ఈ షోకి రణబీర్ కపూర్, రష్మిక కూడా వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ షోలో బాలకృష్ణ, రణబీర్ తో ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది హాట్ టాపిక్ అవుతోంది. యానిమల్’ సినిమా డిసెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఆ సినిమా టీజర్, ట్రైలర్, పాట అన్నీ కూడా ఆసక్తికరంగా వుంది, వైరల్ కూడా అయ్యాయి. తాజాగా వస్తున్న వార్తలతో ఈ మూవీకి మరింత హైప్ రావడం గ్యారంటీ అంటున్నారు.

Latest articles

More like this