వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. విచారణకు అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. కొన్నిరోజులుగా రోజువారి విచారణ చేపడుతోంది. ఈకేసు సంబంధించిన నిందితులను వరుసబెట్టి విచారిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.

YS Avinash Reddy ED Inquiry
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. కొన్నిరోజులుగా రోజువారి విచారణ చేపడుతోంది. ఈకేసు సంబంధించిన నిందితులను వరుసబెట్టి విచారిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈడీ అధికారులు(YS Avinash Reddy ED Inquiry ) ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో విచారణ చేశారు. హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలు.. ఆయనపై వచ్చిన ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా వివేకా హత్యకు రూ. 40కోట్ల డీల్ జరిగిందన్న ఆరోపణపై ప్రధానంగా ఈడీ దృష్టిపెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద హత్యకు ముందు.. తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఫోకస్ చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జిషీట్లను ఆధారంగా ఈడీ ఆరా తీస్తోంది. మనీలాండరింగ్ కేసును (YS Avinash Reddy ED Inquiry)విచారిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈకేసులో అప్రూవర్లుగా మారిన వారిని సైతం విచారించింది. ఇప్పటికే అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా ఈడీ ఎదుట హజరయ్యారు. అంతకుముందు యెర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి తదితరులను కూడా అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా.. 2019 నుంచి జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పై ఈడీ ఫోకస్ పెట్టింది.
2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. వివేకా హత్యకు సంబంధించి రూ.40 కోట్ల ఒప్పందం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నాయి. 2019 నుంచి జరిగిన బ్యాంకు లావాదేవీలు, నిధుల బదిలీలు, అనుమానిత చెల్లింపుల మూలాలను ఈడీ పరిశీలిస్తోంది. 2026 ఆగస్టులో అవినాష్ రెడ్డికి, ఇతర నిందితులకు సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.



