విజయవాడలో భారీగా డ్రగ్స్ కలకలం..
తెలుగు రాష్ట్రాల్లో మత్తుమహమ్మారికి పోలీసులు చెక్ పెడుతున్నారు. ఎక్కడ వాటి ఆనవాళ్లు కనిపించినా చిత్తు చేస్తున్నారు. పామువలే వాసన పసిగట్టి సీజ్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో డ్రగ్స్ కలకలం రేపింది. విజయవాడలో ఈగల్, జీఆర్‌పీ టీం చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ రవాణా గుట్టురట్టు అయింది.

Vijayawada Drugs Seizure
తెలుగు రాష్ట్రాల్లో మత్తుమహమ్మారికి పోలీసులు చెక్ పెడుతున్నారు. ఎక్కడ వాటి ఆనవాళ్లు కనిపించినా చిత్తు చేస్తున్నారు. పామువలే వాసన పసిగట్టి సీజ్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో డ్రగ్స్ కలకలం రేపింది. విజయవాడలో ఈగల్, జీఆర్‌పీ టీం చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ రవాణా గుట్టురట్టు(Vijayawada Drugs Seizure ) అయింది. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఓ యువతి నుంచి 110గ్రాముల ఎండీఎం డ్రగ్స్ ను సీజ్ అధికారులు చేశారు. ఆయువతి బెంగళూర్ నుంచి విజయవాడ వచ్చినట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి విజయవాడకు రైలులో ప్రయాణించి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిర్థారించారు. రైల్వే స్టేషన్‌లోనే ఆమెను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో పలువురికి ఆయువతి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. యువతి వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కాల్ లిస్ట్ వెరిఫై చేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విస్తుపోయే ఘటన జరిగింది. భారీగా గంజాయి పట్టుబడింది. హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్‌ఎస్ అధికారులు సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న గంజాయిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. సినిమా టిక్ స్ట్రైల్‌లో నిందితుడు ప్లాన్ చేశాడు. ఎలక్ట్రికల్ గీజర్‌లో 7.75 కిలోల గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టాడు. అయితే ఆగంజాయిని డీఆర్ఐ అధికారులు చాకచక్యంగా గుర్తించారు. భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 2.71 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకాక్, దోహ రూట్‌లో హైడ్రో ఫోనిక్ గంజాయి స్మగ్లింగ్ (Hyderabad Airport Drug Smuggling )ఎక్కువగా రవాణా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొంతమందిని డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు.



