TN CM Vijay Kanaka Durga Temple Visit

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ ప‌ర్య‌టించారు. గ‌న్న‌వరం ఎయిర్‌పోర్టుకు ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చిన‌ సీఎం విజ‌య్‌కి ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ శ్రీనివాస‌రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు, ఉన్న‌తాధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప్ర‌త్యేక కాన్వాయ్‌లో గ‌న్న‌వ‌రం నుంచి బ‌య‌లుదేరి విజ‌య‌వాడ క‌నక‌దుర్గ‌మ్మ ఆల‌యానికి చేరుకున్నారు. సీఎం విజ‌య్‌కి దుర్గ గుడి ద‌గ్గ‌ర‌ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని, ఆల‌య అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం దుర్గ‌మ్మ‌ను విజ‌య్ ద‌ర్శించుకున్నారు(TN CM Vijay Kanaka Durga Temple Visit). ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. సీఎం విజ‌య్‌కి ఆల‌య అర్చకులు వేద ఆశీర్వ‌చ‌నం చేశారు. అమ్మ‌వారి ప్ర‌తిమ‌తో పాటు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

సీఎం విజ‌య్ రాక‌తో విజ‌య‌వాడ దుర్గ గుడిలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కుంది. అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వచ్చిన భ‌క్తులకు సీఎం విజ‌య్ అభివాదం చేశారు. సీఎం విజ‌య్ ప‌ర్య‌టన‌తో విజ‌య‌వాడ‌లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఏపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో భేటీ కానున్నారు. ప‌లు విష‌యాల‌పై, చెన్నై తాగునీటి స‌మ‌స్య‌ల‌పై(TN CM Vijay Kanaka Durga Temple Visit) కీల‌కంగా చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం విజయవాడ ఉత్సవ్‌ 2.0 కార్యక్రమంలో విజ‌య్‌ పాల్గొంటారు. రాత్రి 9గంట‌ల‌కు తిరిగి చెన్నైకి ప్ర‌త్యేక విమానంలో వెళ్తారు.

ఏపీ ప‌ర్య‌ట‌న‌లో విజ‌య్ సాంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించారు. త‌మిళ‌నాడు స్టైల్‌లో పంచ‌, ష‌ర్ట్‌లో త‌ళుక్కున మెరిసారు. కామ‌న్‌గా రోజు స‌చివాల‌యానికి విజ‌య్ వైట్ ష‌ర్ట్‌, బ్లాక్ ప్యాంట్, ఒక్కోసారి బ్లాక్ కోర్టుతో వెళ్తారు. కాని ఏపీ ప‌ర్య‌ట‌న‌లో మాత్రం సాంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించి అభిమానుల‌కు స‌ప్రైజ్ ఇచ్చారు.