TGSRTC గుడ్‌న్యూస్.. 15 రోజుల ఛార్జీతో నెలరోజుల ప్రయాణం!
తెలంగాణలో మహిళా ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న TGSRTC .. తాజాగా నెలవారీ సీజన్ టికెట్ల (MST) విషయంలో మహిళలకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఇకపై మహిళలు నెలవారీ సీజన్ టికెట్ కోసం 15 రోజుల ఛార్జీ చెల్లిస్తేచాలు. 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది.

TGSRTC Women Bus Pass Discount
తెలంగాణలో మహిళా ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న TGSRTC .. తాజాగా నెలవారీ సీజన్ టికెట్ల (MST) విషయంలో మహిళలకు ప్రత్యేక రాయితీ(TGSRTC Women Bus Pass Discount) ప్రకటించింది. ఇకపై మహిళలు నెలవారీ సీజన్ టికెట్ కోసం 15 రోజుల ఛార్జీ చెల్లిస్తేచాలు. 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. టోల్ ఛార్జీలను కూడా ఈ రాయితీ లెక్కింపులో పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈసేవలు నవంబర్ 14 నుంచి అమల్లోకి వస్తున్నాయి.
మహిళలకు భారీ రాయితీ
మహిళా ప్రయాణికులు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వీరికి ప్రయాణ ఖర్చు తగ్గించేందుకు TGSRTC ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తుంది. నెలవారీ సీజన్ టికెట్ తీసుకునే మహిళలు ఇకపై 20 రోజుల బదులుగా 15 రోజుల ఛార్జీ చెల్లిస్తే చాలు.. నెలరోజులపాటు ప్రయాణ సౌకర్యం పొందవచ్చు. దీంతో సాధారణ నెలవారీ పాస్‌తో పోలిస్తే మహిళలకు అదనపు ఆర్థిక ప్రయోజనం(TGSRTC Women Bus Pass Discount) కలగనుంది. దీంతో MST పాస్‌దారులకు 9 ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి.
9 ప్రత్యేక ప్రయోజనాలు
1.దూర పరిమితి తొలగింపు: నెలవారీ సీజన్ టికెట్ల జారీకి ఇప్పటివరకు ఉన్న దూర పరిమితిని తొలగించనున్నారు. నిర్దేశిత రూట్, ఛార్జీల నిబంధనలకు లోబడి పాస్‌లు(TGSRTC Women Bus Pass Discount) పొందవచ్చు.
2.టోల్ ఛార్జీల తగ్గింపు: సాధారణ పాస్‌దారులకు టోల్ ఛార్జీల లెక్కింపును 25 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించనున్నారు.
3.డీలక్స్ ఎంఎస్టీ: సాధారణ ప్రయాణికులకు డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పాస్‌లతో ఈ-డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు.
4.ఆదివారం ఉచిత ప్రయాణం: హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో ఎంఎస్టీ పాస్దారులు ఆదివారాల్లో అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు ఈ సౌకర్యం వర్తించదు.
5.కాంబో టికెట్ సదుపాయం: అదనంగా రూ.20 చెల్లించి పల్లెవెలుగు ఎంఎస్టీ పాస్దారులు ఎక్స్‌ప్రెస్, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎక్స్‌ప్రెస్ ఎంఎస్టీ పాస్దారులు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
6.సూపర్ లగ్జరీ బస్సుల్లో రాయితీ: తమకు కేటాయించిన రూట్ కాకుండా తెలంగాణలోని ఇతర మార్గాల్లో ప్రయాణించే సీజన్ టికెట్‌దారులకు సూపర్ లగ్జరీ, అంతకంటే పైస్థాయి బస్సుల బేసిక్ ఛార్జీపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
7.రెండు నెలల పాస్‌పై అదనపు వెసులుబాటు: రెండు నెలల సీజన్ టికెట్ తీసుకునేవారికి అదనంగా ఐదు రోజుల వ్యాలిడిటీ కల్పించనున్నారు.
8. మూడు నెలల పాస్‌పై అదనపు వెసులుబాటు: మూడు నెలల సీజన్ టికెట్ తీసుకునేవారికి అదనంగా 10 రోజుల వ్యాలిడిటీ ఇవ్వనున్నారు.
9. మహిళలకు ప్రత్యేక రాయితీ: మహిళా ప్రయాణికులు 15 రోజుల ఛార్జీ చెల్లించి 30 రోజుల పాటు సీజన్ టికెట్ ప్రయోజనం పొందవచ్చు.
ఎక్కువ ప్రయోజనం?
TGSRTC తీసుకొచ్చిన వెసులుబాటు కొత్త మార్పులతో ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులకు ప్రయాణ ఖర్చులు(TGSRTC Women Bus Pass Discount) తగ్గనున్నాయి. ముఖ్యంగా ఒకే రూట్లో రోజూ ప్రయాణించే వారికి నెలవారీ సీజన్ టికెట్లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. ఆదివారం ఉచిత ప్రయాణ సదుపాయం కూడా నగర ప్రయాణికులకు అదనపు ప్రయోజనం కానుంది.



