HomeTechnologyమీ ఫోన్ స్పీడ్ గా ఛార్జింగ్ కావాలంటే..

మీ ఫోన్ స్పీడ్ గా ఛార్జింగ్ కావాలంటే..

Published on

మనం నిత్యం ఫోన్ వాడుతూ ఉంటాం. ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మన బాధ వర్ణనాతీతం. అదే అత్యవసర పరిస్థితులున్నప్పుడు నిమిషాల వ్యవధిలో ఫోన్ ఛార్జ్ అయితే ఎంతబాగుండు అనిపిస్తుంది. అది సాధ్యం కాదనుకుంటారు చాలామంది. కానీ నిమిషాల వ్యవధిలో మొబైల్ ఛార్జ్ అవడం సాధ్యమే.

సాధారణంగా స్మార్ట్ ఫోన్ ను కంపెనీ వారు ఇచ్చిన ఛార్జర్ తో ఛార్జింగ్ పెడితే తొందరగానే ఛార్జ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు అత్యవసర ప్రయాణాలు పడుతుంటాయి. మరికొన్నిసార్లు అర్జెంట్ గా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ లో ఛార్జింగ్ తక్కువగా ఉంటే చెప్పలేనంత కోపం, అసహనం కలుగుతుంటాయి. కేవలం నిమిషాల వ్యవథిలో ఛార్జ్ అయితే ఎంతబాగుండో అనిపిస్తుంది. అది సాధ్యం కాదనుకుంటారు చాలామంది.

కానీ నిమిషాల వ్యవధిలో మొబైల్ ఛార్జ్ అవడం సాద్యమే. మొబైల్ లో ఒకే ఒక సెట్టింగ్ మార్చడం ద్వారా యమా స్పీడ్ గా మొబైల్ ఛార్జ్ అవుతుంది. మొబైల్ ఫోన్ బ్యాటరీ తొందరగా అయిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వాటిలో బ్లూటూత్, జీపీయస్ ఆన్ లో ఉండటం, వివిధ రకాల యాప్స్ రన్ అవుతూ ఉంటడం, యాప్స్ తాలుకూ నోటిఫికేషన్లు పదే పదే రావడం, ఇక అన్నిటికంటే ముఖ్యంగా మొబైల్ లో గేమ్స్ ఉండటం. వీటి కారణంగా బ్యాటరీ తొందరగా డ్రై అవుతుంది. కానీ అత్యవసరంగా బయటకు వెళ్ళాల్సివచ్చినప్పుడే చాలామందికి మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉండి వెక్కిరిస్తుంది.

మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా వీటి కారణంగానే ఛార్జింగ్ స్లోగా ఎక్కుతుంది. వీటిని డిజేబుల్ చేస్తే ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటుంది. కానీ మొబైల్ లో ఉన్న ప్రతి యాప్ ను డిజేబుల్ చేయడం కంటే ఎరోప్లేన్ మోడ్ ఆన్ చేయడం మంచి ఉపాయం. ఇది ఆన్ చేయడం వల్ల టోటల్ మొబైల్ పనితీరు స్థంభిస్తుంది. జీపియస్, హాట్స్పాట్, వైపై, బ్లూటూత్ అన్ని విశ్రాంతి దశలోకి వెళ్ళిపోతాయి. ఈ కారణంగా మొబైల్ సాధారణం కంటే రెండింతల వేగంగా ఛార్జింగ్ అవుతుంది.

మొబైల్ ఫోన్ చాలా తొందరగా ఛార్జ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎప్పుడూ ఆప్షన్ ఉపయోగించడం మాత్రం తప్పంటున్నారు టెక్ నిపుణులు. మరీ ముఖ్యంగా మొబైల్ ఎరోప్లేన్ మోడ్ లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ సర్వీస్ కూడా ఆగిపోతుంది. ముఖ్యమైన ఇన్ కమింగ్ కాల్స్ ఉండొచ్చు. అదే సమయంలో ఎవరికైనా ఫోన్ కూడా చేయాల్సిన అవసరం పడచ్చు. కాబట్టి ఎరోప్లేన్ మోడ్ ను అత్యవసరం అయితే తప్ప సాధారణ సమయంలో ఉపయోగించకూడదు. ఎరో ప్లేన్ మోడ్ వాడేముందు మనకు ఎలాంటి అత్యవసర ఫోన్లు రావని నిర్ధారించుకున్నాకే మోడ్ ఎనేబుల్ చేయడం మాత్రం మరిచిపోవద్దు.

Latest articles

More like this