HomeTechnologyచాట్ జీపీటీ దివాళా తీస్తుందా? షాకింగ్ నిజాలు

చాట్ జీపీటీ దివాళా తీస్తుందా? షాకింగ్ నిజాలు

Published on

ప్రపంచమంతా  Artificial Intelligence కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ (ChatGPT) గురించే ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. లాంచ్ అయిన మూడు నెలల్లోనే మిలియన్ల మంది యూజర్లు దీనిని వినియోగిస్తున్నారు. దీంతో టెక్నాలజీ రంగంలో ఇదో సంచలనంగా మారింది. చాట్ జీపీటీని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సెర్చ్ ఇంజిన్ గూగుల్‍కు కూడా ఈ ఏఐ చాట్ బాట్ ‘చాట్ జీపీటీ’ సవాలు విసురుతోంది. ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తీసుకొచ్చిన ఈ చాట్ జీపీటీ టెక్ రంగంలో పెనుమార్పులకు కారణమవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ కోట్లాదిమంది నుంచి తిరుగులేని ఆదరణ సొంతం చేసుకుంది. అయితే దీని రాకతో ఉద్యోగాలకు ఎసరు అంటూ కొందరు వాదిస్తుంటే.. కొత్త తరహా ఉద్యోగాలు పెరగటంతో పాటూ ఉత్పాదకత పెరుగుతుందని మరి కొందరు ఏఐ వినియోగాన్ని సమర్థిస్తున్నారు.

దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ (Chat Generative Pre Trained Transformer). అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్‍జీపీటీ పని చేస్తుంది. మీరు ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా, వివరంగా ఇస్తుంది. ఎందుకంటే ఈ చాట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటా బేస్ ఉంటుంది. డేటా బేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చెప్పేస్తోంది.చాట్ జీపీటీ ఏ విషయంపై అయినా సమాధానాలు ఇట్టే మనకు అందచేస్తుంది. హిస్టరీ, సైన్స్, టెక్నాలజీ, కోడింగ్, మ్యాథమాటిక్స్, జనరల్ నాలెడ్జ్, పోగ్రామింగ్ లాంగ్వెజెస్, భాషలు, సాంస్కృతిక విషయాలు, ఆరోగ్యం, వంటకాలు, లైఫ్‍స్టైల్.. ఇలా ఒక్కేటేమిటి ఏ విషయాన్నైనా టెక్స్ట్ రూపంలో చాట్ జీపీటీని అడగవచ్చు. దాదాపు అన్ని ప్రశ్నలకు ఇది సమాధానాలు ఇస్తుంది. గూగుల్‍ను అడిగినట్టుగానే ఈ చాట్ జీపీటీని ఏ క్వశ్చన్లు అయినా అడగవచ్చు. చాట్ జీపీటీ తన డేటా బేస్‍లోని సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. మీరు ఈ చాట్‍జీపీటీతో టెక్స్ట్ రూపంలో ముచ్చటించవచ్చు. గ్రామర్ తప్పులను కూడా ఇది సరిదిద్దుతుంది. ఏదైనా అంశంపై కథనాలను కూడా రాసిపెడుతుంది. సెంటెన్స్ లను మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం 2021 వరకు సమాచారాన్ని చాట్‍జీపీటీ కచ్చితంగా చెబుతోంది. 2022 నుంచి జరిగిన తాజా పరిణామాలు ఇంకా డేటా బేస్‍లో లేవు. త్వరలోనే అప్‍డేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్‍కు చాట్ జీపీపీ కనెక్ట్ అయి లేదు. అయితే దీని డేటా బేస్‍లో చాలా సమాచారం ఉంటుంది కాబట్టి.. పూర్తి వివరాలను అందించగలదు.2022 నవంబర్‌లో లేటెస్ట్ చాట్ జీపీటీ-3 అందుబాటులోకి వచ్చింది. లాంచ్ అయిన మూడు రెండు నెలల్లోనే ప్రపంచమంతా పాపులర్ అయింది. ఇందుకు ముఖ్య కారణం అడిగిన ప్రశ్నకు ఇది ఒకే సమాధానాన్ని పూర్తి సమాచారంతో సమగ్రంగా ఇస్తుంది. ఒకవేళ దేని గురించి అయినా గూగుల్‍లో సెర్చ్ చేస్తే చాలా లింక్స్ కనిపిస్తాయి. దాంట్లో సమాచారాన్ని అంతా క్రోడీకరించుకోవాల్సి వస్తుంది. అదే చాట్ జీపీటీ అయితే ఒకే ఆన్సర్ ఇస్తుంది. అది కూడా సింపుల్, కాన్వర్జేషన్ లాంగ్వేజ్‍లో వివరంగా సమాధానం చెప్పేస్తుంది. అందుకే చాట్ జీపీటీ అత్యంత వేగంగా పాపులర్ అయింది. కోట్లాది మంది దీన్ని ఇష్టపడుతున్నారు.

ప్రస్తుతం చాట్ జీపీటీని వెబ్‍సైట్ ద్వారా వినియోగించవచ్చు. openai.com/ blog /chatgpt వెబ్‍సైట్‍లో రిజిస్టర్ అయి చాట్ జీపీటీని వాడవచ్చు. రిజిస్టర్ అయ్యాక ప్రశ్నలను టెక్ట్స్ బాక్స్ లో ఎంటర్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రస్తుతం ఇది ఉచితం. అయితే సబ్‍స్క్రిప్షన్‍తో చాట్ జీపీటీ ప్రొఫెషనల్ వెర్షన్‍ను త్వరలో ఓపెన్ ఏఐ తీసుకురానుంది. ఇలాంటి సందర్భంలో అనలటిక్స్‌ఇండియా మ్యగజైన్‌విడుదల చేసిన నివేదిక ఆసక్తికరంగా మారింది. 2024 నాటికి చాట్‌జీపీటీని మేకర్స్‌దివాలా తీసే ప్రమాదం ఉందని ఆ నివేదిక ద్వారా తెలిపింది.

చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐను రూపొందించిన శామ్‌ఆల్ట్‌మన్‌(Sam Altman) ఆర్థిక సంక్షోభం అంచున ఉండే అవకాశం ఉందని ఒక నివేదికలో వెల్లడయింది. ఎక్కువ ఖర్చుతో ఉండే API లను ఏఐలో వినియోగించటం కూడా నష్టాలకు ముఖ్య కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఒక్కో ఏఐ సర్వీసును రోజంతా అందించటానికి రూ.5.80 కోట్లు ఖర్చవుతోంది. దీంతో ఆల్ట్‌మన్‌ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే అవకాశం లేకపోలేదు. GPT-3.5, GPT-4 వెర్షన్లు తీసుకొచ్చి డబ్బును ఆర్జించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ఫలితాలు ఇవ్వలేకపోయాం అని ఆ నివేదికలో తెలిపింది.

చాట్‌జీపీటీ ఇప్పటి వరకు లాభాల బాట పట్టలేదని అనలటిక్స్‌తన నివేదికలో తెలిపింది. దీంతో పాటూ ఈ ఏఐ వాడకం కూడా క్రమేపీ తగ్గిందని పేర్కొంది. జూన్‌లో 1.7 బిలియన్ల మంది చాట్‌జీపీటీని వినియోగిస్తుండేవారు. కానీ, ప్రస్తుతం వీరి సంఖ్య 12శాతం క్షీణించి 1.5 బిలియన్లకు చేరింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మొదట్లో చాలా కంపెనీలు తమ సంస్థలో చాట్‌జీపీటీ వినియోగానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు తమ సంస్థల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్‌బాట్‌లను తయారు చేయించుకుంటున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) సరికొత్త కృత్రిమ మేధ వ్యవస్థ ‘లామా2’ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Latest articles

More like this