SRH wedding gift rumours

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌, ఐపీఎల్ SRH ఓనర్ కావ్య మారన్‌ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 11న యూరప్‌లోని గ్రీస్‌ దేశంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్ జరగనుంది. తర్వాత నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. రిసెప్షన్‌కి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో వధువు కావ్య మారన్ తల్లిదండ్రులు, సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌ దంపతులు కలిసారు. చైన్నైలో జరిగే వెడ్డింగ్‌ రిసెప్షన్‌కి రావాలని ఇన్విటేషన్‌ ఇచ్చారు. దీంతో ఇప్పుడు దాకా ఉన్న రూమర్స్‌కు(SRH wedding gift rumours! ) తెరపడింది. త్వరలోనే అనిరుధ్‌, కావ్య మారన్‌ ఒక్కటికాబోతున్నారని కన్ఫార్మ్ అయింది.

ఇక్కడే మరో టిస్ట్ చోటుచేసుకుంది. కట్నం గురించి ఓ వార్త వైరల్‌ అవుతుంది. అదిరిపోయే బీజియం ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవించంద్రన్‌కు.. అతను ఆశ్చర్యపోయేలా కావ్య పేరెంట్స్ భారీ మొత్తంలో కట్న కానుకలు ఇస్తున్నట్లు వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అదేదో బంగారం, నగలు, సన్‌ ఫిక్చర్స్ కాదు..  ఐపీఎల్‌లో మోస్ట్ పాపులర్ టీం అయిన SRHని కట్నంగా(SRH wedding gift rumours) కట్టబెడుతున్నారని సోషల్ మీడియాలో న్యూస్ చెక్కర్లు కొడుతుంది. వేల కోట్ల విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీ హక్కులను ఇస్తున్నారని క్రీడా, సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సోషల్‌ మీడియా జరుగుతున్న ప్రచారమే కనుక నిజమైతే.. ఇండియా కార్పోరేట్‌ చరిత్రలోనే హైయెస్ట్ కాస్ట్‌లీ కానుకగా నిలిచిపోనుంది. ఇదే విషయాన్ని అటు మారన్ కుటుంబం కానీ, అనిరుధ్ వైపు నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో SRHటీంకి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఆటీంను కట్నంగా ఇస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా అయింది.