Sonia Gandhi on Emergency

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సంచలన విషయాలు చెప్పారు. నవంబరు 10న సోనియా రాసిన ‘బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అందరి ఎమర్జెన్సీ(Sonia Gandhi on Emergency) అనగానే ఇందిరా గాంధీ, సంజయ్‌ గాంధే గుర్తుకువస్తారు. కాని దానికి కారణం పూర్తిగా వారిద్దరే కాదన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీపై సీనియర్‌ నేతల నుంచి కూడా ఒత్తిడి ఉండేదని చెప్పారు. ఆమె చుట్టూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినవారిలో రాజీవ్‌గాంధీ కూడా ఉన్నారని తెలిపారు. ప్రజలు చెప్పిన సమస్యలు, ఫిర్యాదులను రాజీవ్‌ తన తల్లి దృష్టికి తీసుకెళ్లేవారని సోనియా తెలిపారు.

ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయం పెద్ద పొరపాటు అని అన్నారు సోనియా. సంజయ్‌ గాంధీని అదుపులో ఉంచి ఉంటే, ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన నష్టంలో చాలావరకు నివారించేవారని అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ నిర్ణయంపై అప్పట్లో కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. ఎమర్జెన్సీని రాజీవ్‌ గాంధీ కూడా వ్యతిరేకించారన్నారు. వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండాలని రాజీవ్‌ తన తల్లికి చెప్పినప్పటికీ.. సంజయ్‌ మాత్రం పట్టుబట్టారని తెలిపారు. రాజీవ్‌ తన తల్లిని నిలదీయడానికి ప్రయత్నించగా.. ఆమె వినడానికి నిరాకరించారని చెప్పారు. ఈ విషయం కుటుంబంలో కూడా గోడవలకు దారితీసిందన్నారు. కేవలం సంజయ్‌ నుంచే కాకుండా సీనియర్ల నుంచి ఇందిరా గాంధీ(Sonia Gandhi on Emergency) పై ఒత్తిడి ఉండేదన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హక్కులు నిలిపివేశారని సోనియా అంగీకరించారని సోనియా అన్నారు. హేబియస్‌ కార్పస్‌ హక్కును కూడా రద్దు చేశారని చెప్పారు. అయితే అప్పటి పరిస్థితులు ఇందిరాగాంధీని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని వివరించారు. హింసాత్మక ఆందోళనలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా వ్యవస్థపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వ అధికారులు, సాయుధ దళాలు ఆదేశాలను ధిక్కరించాలన్న పిలుపులు కూడా వచ్చాయని తెలిపారు. ఎమర్జెన్సీ(Sonia Gandhi on Emergency) సమయంలో జరిగిన అకృత్యాలపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాతి కాలంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారని సోనియా గాంధీ తెలిపారు. ఆ ఘటనలకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారని వెల్లడించారు. ఎమర్జెన్సీకి సంజయ్‌గాంధీ ఒక్కరినే బాధ్యుడిగా చూడకూడదని స్పష్టం చేశారు. తర్వాత పరిస్థితులను అర్థం చేసుకున్న ఇందిరాగాంధీనే 1977 మార్చిలో ఎన్నికలకు పిలుపునిచ్చారని సోనియా గుర్తుచేశారు.

అయితే తన జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను ఇతరులు చెప్పడం కంటే తన మాటల్లో తానే వివరించాలనే ఉద్దేశంతో ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నట్లు సోనియా గాంధీ వెల్లడించారు. ఒకానొక సమయంలో తన కథను తానే చెప్పాలని అనిపించిందన్నారు. తన తల్లి జీవిత ప్రయాణంపై సోనియా(Sonia Gandhi on Emergency)ను రాహుల్ గాంధీ ప్రశంసించారు. ప్రజా జీవితంలో ఆరు దశాబ్దాలు గడిచినా ఆమె వ్యక్తిత్వం మారలేదని కొనియాడారు. ప్రజా జీవితంలో 60 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ అదే వ్యక్తిత్వం అని కితాబిచ్చారు. అమ్మా.. నిన్ను చూసి గర్విస్తున్నానని అంటూ ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు.