తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కార్మికులకు దసరా బోనస్
దసరా సందర్భంగా మరో శుభవార్త కూడా భట్టి విక్రమార్క చెప్పారు . రాబోయే 15 రోజుల్లో సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగ దరఖాస్తులను కూడా పూర్తిగా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు

Singareni Workers Dasara Bonus 2026
దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో వాటా ఇచ్చింది. సింగరేణి సంస్థ పొందిన లాభాల్లో నుంచి 34 శాతాన్ని కార్మికులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Singareni Workers Dasara Bonus 2026)వెల్లడించారు. దసరా పండుగకు ముందు శాశ్వత కార్మికులకు ఒక్కోక్కరికి రూ. 1,53, 903 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.5,500 బోనస్ ఇస్తామన్నారు. అంతేకాదు దసరా సందర్భంగా మరో శుభవార్త కూడా భట్టి విక్రమార్క చెప్పారు . రాబోయే 15 రోజుల్లో సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగ దరఖాస్తులను కూడా పూర్తిగా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కార్మికులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. కార్మికులు ఇంతకాలం చికిత్స కోసం కొత్తగూడెం వెళ్లాల్సివచ్చేదని.. ఇకపై ఆ అవసరం లేకుండా కార్మికులు పనిచేస్తున్న ఏరియాల్లోనే ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
అంతేకాదు గతంలో కరోనా కష్టకాలంలో తగిన ముందస్తు సమచారం లేకుండా విధులకు గైర్హాజయ్యారనే కారణంతో సస్పెండ్ చేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. సస్పెండ్ అయిన కార్మికులందరికీ తిరిగి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సింగరేణి సమస్థకు చెందిన ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతోపాటు మైనింగ్ జరగని భూముల్లో కార్మికుల కోసం ప్రత్యేక హాసింగ్ కాలనీలను నిర్మిస్తామని హామీ(Singareni Workers Dasara Bonus 2026) ఇచ్చారు. సింగరేణి ప్రాంతాల్లో నివసించే ప్రజలు, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారి కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.



