Rajinikanth Jailer 2 Movie Review: ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ రజినీ కాంత్ అభిమానులకు పండుగ రోజునే చెప్పాలి. ఎందుకంటే ఆయన నటించిన జైలర్ -2 ఇవాళ థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయింది. అయితే ఉదయం షో నుంచి కూడా ఈసినిమాకు మంచి పాజిటివ్ టాక్‌ వస్తుంది. జైలర్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండడంతో సీక్వెల్‌పై అభిమానులు భారీ స్థాయిలో ఆశించారు. అయితే సెకండ్‌ ఆఫ్‌లో కొంత పార్ట్ మినహా సినిమా మొత్తం బాగుందని అభిమానులు చెప్తున్నారు. అభిమానుల టాక్‌ను బట్టి చూస్తే ఈ దసరా సీజన్‌లో జైలర్‌ -2హిట్‌ కొట్టిందనే చెప్పాలి.

కామన్‌గా రజినీ కాంత్ సీక్వెల్ మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపరు. అప్పట్లో రోబో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. దాని తర్వాత వచ్చిన రోబో 2.0 ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు దానిని సీక్వెల్ తీసి బోల్తా పడకూడదనేది రజనీ ఆలోచన. అయితే ఈసారి రోబో 2.0లో జరిగిన తప్పులను దృష్టిలోపెట్టుకున్న జైలర్ డైరక్టర్ నెల్సన్‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ ఆఫ్‌లో మంచి కామిడీ టైమింగ్.. రజినీకాంత్ మేనరిజమ్ బాగా పలికించాయి. వీటికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ బీజీయం ఇరగదీసాడని తెలుస్తోంది. ప్రీ ఇంటర్వెల్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌ కుమార్, జాకీ ష్రాఫ్‌ను రంగంలోకి దించిన దర్శకుడు క్లైమాక్స్‌లో హృతిక్‌ రోషన్‌ సినిమాకు మంచి ప్లస్ అయ్యాడు. జైలర్ 3కి లీడ్‌ ఇస్తూ విజయ్‌ సేతుపతిని నెల్సన్ తెర మీద చూపించడం కొసమెరుపు.

రజనీకాంత్‌ తన స్టైల్‌లో యాక్టింగ్ అల్లాడించారు. రమ్యకృష్ణ, మిర్నా పాత్రల పరిధి మేరకు నటించారు. భగవతి పెరుమాళ్‌, యోగిబాబు, నమో నారాయణ బాగా నవ్వించారు. విద్యాబాలన్‌తో కాస్తంత కొత్తగా చేయించారు. అదే సమయంలో ఎస్. జె.సూర్యను డైరెక్టర్‌ బాగానే కంట్రోల్ చేశాడు. మాస్ ఆడియెన్స్ ను మెప్పించడం కోసం ఫస్ట్ ఆఫ్‌లో పూర్ణతో, సెకండ్‌ ఆఫ్‌లో నోరా ఫతేహీతోనూ దర్శకుడు ఐటమ్‌ సాంగ్స్ చేయించాడు. నిజానికి వాటి అవసరం ఈసినిమాకు లేదు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ అనిరుధ్‌ తన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని నిలబెట్టాడు. సాంగ్స్ పరవాలేదనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్‌ కన్నా సెంకండ్ ఆఫ్ కొద్దిగా నెమ్మదించినట్లు అనిపిస్తుంది. టోటల్ ఓవరాల్‌గా జైలర్ 2 ప్రేక్షకులను నిరాశకు గురిచేయదు. దసరా బరిలో నిలిచి కాసుల వర్షం కురిపిస్తుంది.