ప్రముఖ సంగీత దర్శకుడు దేవా ఇక లేరు..

Music Director Deva Passes Away
సినీ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా (75) కన్ను మూశారు(Music Director Deva Passes Away). గుండె పోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుది శ్వాస విడిచారు. ఈయన తమిళంతో పాటు తెలుగు, మళయాలం, కన్నడలో సుమారు 400 సినిమాకు సంగీతం అందించారు. తమిళం, తెలుగులో మంచి హిట్ సినిమాలకు మ్యూజిక్ చేశారు. తమిళంలో గానా సంగీత శైలికి విశేష గుర్తింపు ఉంది.
1950లో చెన్నైలో జన్మించిన దేవా. జేబీ కృష్ణ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. 1986లో మాట్టుకుర మన్నారు సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంతో పాటు పలు భాషల్లో హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీమాన్ బ్రహ్మచారి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఆతర్వాత చిరంజీవి నటించిన మాస్టర్, పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా తొలిప్రేమకు సంగీతం అందించారు. ఇప్పటికీ తొలిప్రేమ పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాదు ఆటోడ్రైవర్, బాగున్నారా, నాగ సినిమాకు దేవా సంగీతం అందించారు. ఇక తమిళంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన బాషా, అన్నామలై, అరుణాచలం వంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులోను చెరగని ముద్ర (Music Director Deva Passes Away)వేసుకున్నారు. ముఖ్యంగా సామాన్యుల జీవితాలకు దగ్గరగా ఉండే గానా పాటలకు తనదైన శైలిలో సంగీతం అందించారు. తమిళ సినీ పరిశ్రమలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.



