కీర్తి సురేష్, నిత్యామీనన్‌ని దాటేసి ఆనంది!

Garividi Lakshmi: గరివిడి లక్ష్మి సినిమాకోసం దర్శకుడు ముందుగా సాయిపల్లవి, నిత్యామీనన్‌తో పాటు నివేతా థామస్‌ని సంప్రదించారు. కానీ వారు కొన్ని కారణాలతో ఓకే చెప్పకపోవటంతో ఆ ఛాన్స్ ఆనందిని వెతుక్కుంటూ వచ్చింది. పక్కా తెలంగాణ అమ్మాయి అయినా ఉత్తరాంధ్ర కళాకారిణి పాత్రకు ఆనంది జీవంపోసింది. ఇండస్ట్రీలో తన భవిష్యత్తుకు జీవంపోసుకుంది.
తెలంగాణ అమ్మాయి ఉత్తరాంధ్ర పాత్రలో ఒదిగిపోయింది. ఇన్నాళ్లూ ఎలా మిస్ అయ్యామని ఇండస్ట్రీ అంతా తనవైపు చూసేలా చేసింది. అరె ఆ అమ్మాయిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆ సినిమా చూశాక ఇండస్ట్రీలో తన చుట్టే టాక్ నడుస్తోంది. తనే ఆనంది. పక్కా తెలంగాణ అమ్మాయి. కానీ ఉత్తరాంధ్ర ప్రసిద్ధ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి బయోపిక్‌లో తన నటనకు నూటికి రెండొందల మార్కులు పడుతున్నాయి. కీర్తిసురేష్, సాయిపల్లవి అభినయానికి ఏమాత్రం తగ్గదంటూ ఆనందిని అంతా తెగ పొగిడేస్తున్నారిప్పుడు.
రిలీజ్ అయ్యేదాకా గరివిడి లక్ష్మి సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. అసలు ఇండస్ట్రీలో దాని గురించి పెద్ద చర్చే జరగలేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది దాన్నెంత గొప్పగా చిత్రీకరించారో. అక్టోబరు 17న రిలీజ్ అయిన ఈ పిక్చర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జానపద కళల గొప్పతనాన్ని, తనకు నచ్చిన రంగంలో ఓ మహిళా కళాకారిణి ఎదుర్కున్న ఒడిదుడుకులను గరివిడి లక్ష్మి కళ్లకు కట్టింది. ఆ భావోద్వేగ చిత్రకావ్యం అందరినీ కట్టిపడేసింది. ఆ సినిమాలో హీరోయినే హీరో. టైటిల్‌రోల్‌కి పూర్తి న్యాయంచేసింది ఆనంది.
ఎప్పుడో తెరంగేట్రంచేసినా చెప్పుకోదగ్గ అవకాశాలు రాని ఆనందికి గరివిడి లక్ష్మి సినిమా తన కెరీర్‌ని మలుపుతిప్పే ఓ అదృష్టంలా తగిలింది. వాస్తవానికి ఈ సినిమాకోసం దర్శకుడు ముందుగా సాయిపల్లవి, నిత్యామీనన్‌తో పాటు నివేతా థామస్‌ని సంప్రదించాడు. కానీ వారు డేట్స్ కేటాయించలేకపోవటంతో ఆనందికి అవకాశం ఇచ్చారు. పక్కా తెలంగాణ అమ్మాయి అయినా ఉత్తరాంధ్ర కళాకారిణి పాత్రకు ఆనంది జీవంపోసింది. ఇండస్ట్రీలో తన భవిష్యత్తుకు జీవంపోసుకుంది.



