Jailer 2 Box Office Collection

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నారు. ఆయన నటించిన జైలర్‌- 2 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తలైవా నటించిన జైలర్ -2 ..ఈనెల 15న రిలీజ్‌ అయింది. రిలీజైన రెండు రోజుల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా రూ. 200 కోట్ల వసూలు రాబట్టింది. ఇప్పటివరకు రూ. 209.10 కోట్ల గ్రాస్ వసూలు(Jailer 2 Box Office Collection ) చేసినట్లు ట్రెడ్ వర్గాలు తెలిపాయి. అయితే రెండో రోజు ఇండియాలో వసూళ్లు .. తొలిరోజుతో పోలిస్తే తగ్గినట్లు తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్ తెలుగు మార్కెట్‌లోనే కనిపించినట్లు తెలుస్తుంది. జైలర్ -2 ఈనెల 15న రిలీజ్‌ అయితే.. 16న విజయదేవర కొండ, రష్మిక మంధనా నటించిన రణబాలి విడుదలైంది. ఇక 17వ తేదీన పీపుల్స్ ఫ్యాక్టీరీ మీడియా నుంచి గరివిడి లక్ష్మీ రిలీజ్‌ అయింది. దీంతో జైలర్-2 సినిమా థియేటర్లు చాలా వరకు తగ్గాయి. ఆఎఫెక్ట్ వసూళ్లపై పడ్డాయి.

తొలిరోజు రూ. 59.70 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా.. రెండో రోజు 40.4శాతం తగ్గింది. అయితే సెకండ్ డే ప్రాంతీయ భాషల వసూళ్లలో తమిళ వర్షన్‌ ముందంజలో నిలిచింది. 7,243 షోల ద్వారా రూ. 25.25కోట్ల నెట్ వసూళ్లు రాగా.. తెలుగులో 1,940 షోల ద్వారా రూ. 7.25కోట్లు రాబట్టింది. హిందీ వర్షన్‌ రూ. 2.75 కోట్లు వసూలు(Jailer 2 Box Office Collection ) చేయగా.. కన్నడ వర్షెన్‌ రూ. 35లక్షలు సాధించింది. టోటల్‌గా భారత్‌లో గ్రాస్ వసూళ్లు రూ. 112.10 కోట్లు కాగా.. విదేశాల్లో రూ. 97 కోట్ల ఆదాయం వచ్చినట్లు సాక్‌నిల్స్ లెక్కలు చెప్పాయి. ఇక వీకెండ్‌లో వసూళ్లు భారీగానే ఉంటాయని అంచనావేస్తున్నారు.

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈచిత్రాన్ని నెల్సన్‌ డైరెక్ట్ చేశాడు. జైలర్ -2 సీక్వెల్‌లో రజినీ కాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించారు. మోహన్‌లాల్, శివరాజ్‌ కుమార్, జాకీ ష్రాఫ్‌ తమ క్యారక్టర్లు తిరిగి చేశారు. విద్యాబాలన్, రమ్యకృష్ణన్‌, ఎస్‌.జె. సూర్య, మిథున్‌ చక్రవర్తి జైలర్-2లో కీలక పాత్రలు చేశారు. హృతిక్ రోషన్‌ గెస్ట్ రోల్ చేశారు. అనిరుథ్ రవిచంద్ర సంగీతం అందించారు.