దీపావళి వేడుకల్లో ప్రియాంక జిగేల్.. ఆమె గౌన్ వెనుక పెద్ద కథ
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా దీపావళి వేడుకలను తన భర్త నిక్ జోనస్, కుమార్తెతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈవేడుకల్లో ప్రియాంక డిజైనర్ గౌనుతోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ గౌను వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

Priyanka Chopra Diwali Look
దీపావళి వేడుకలను బాలీవుడ్ నటులు గ్రాండ్‌గా చేసుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా దీపావళి వేడుకలను తన భర్త నిక్ జోనస్, కుమార్తెతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో ప్రియాంక తన అందంతోనే కాదు.. అదిరిపోయే తన డ్రైస్తో ఆకట్టుకున్నారు. డిజైనర్ గౌనుతోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ తోరానీ రూపొందించిన గౌను(Priyanka Chopra Diwali Look)లో మెరిసిపోయింది. ముదురు మెరూన్, బంగారు రంగుల కలయికతో రూపొందిన ఈ డ్రెస్‌లో భారతీయ కళా వైభవం ఉట్టిపడింది. అయితే ఈ గౌను వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ అద్భుతమైన డిజైనర్‌వేర్‌ను రూపొందించడానికి ఏకంగా 2,200 గంటలకు పైగా సమయం పట్టినట్లు తెలుస్తోంది.
గౌను ప్రత్యేకతల విషయానికొస్తే.. భారతీయ సంప్రదాయ ఎంబ్రాయిడరీ కళలకు అద్దం పట్టేలా దీన్ని తీర్చిదిద్దారు. కాశ్మీరీ ఆరీ, జర్దోజీ, డోరీ, మారోడీ వంటి అరుదైన చేతి పనితనాన్ని ఇందులో అందంగా పొందుపరిచారు. ముత్యాలు, గవ్వలతో గౌను(Priyanka Chopra Diwali Look)కు మరింత హుందాతనాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇందులో ఉపయోగించిన గవ్వలు తన సింధీ మూలాలకు ప్రతీకగా నిలుస్తాయని ప్రియాంక వెల్లడించింది. భారతీయ వాస్తుశిల్ప వారసత్వంలోని ఝరోఖాలు, పురాతన కోటలు, సంప్రదాయ ప్రాంగణాల నుంచి స్ఫూర్తి పొంది ఈ డిజైన్‌ను రూపొందించారు. పక్షులు, పువ్వులు, ఆకాశాన్ని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో గౌను ముందు భాగాన్ని అందమైన కళాఖండంలా తీర్చిదిద్దారు.
గౌను(Priyanka Chopra Diwali Look)కు జాలువారే కుచ్చులు, గజ్జెల తరహా అలంకరణలు జోడించి ప్రతి కదలికలోనూ ప్రత్యేకమైన అందం కనిపించేలా డిజైన్ చేశారు. లక్ష్మీదేవి రాకకు ప్రతీకగా భావించే పండుగ శోభను కూడా ఈ అలంకరణల్లో ప్రతిబింబించారు. సంప్రదాయ కళలను యథాతథంగా కాకుండా ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా మలచడం ఈ డిజైన్‌లో మరో ప్రత్యేకత. ఇక ప్రియాంక భర్త నిక్ జోనస్ కూడా ఎంబ్రాయిడరీ జాకెట్‌తో కూడిన కుర్తాలో సంప్రదాయ లుక్‌లో మెరిశారు. మొత్తానికి క్రాకర్స్ వెలుగుల కంటే తన 2,200 గంటల కళాఖండంతోనే ఈ దీపావళికి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



