Microsoft Global Outage

మైక్రోసాఫ్ట్‌ సేవల్లో ఏర్పడిన సాంకేతిక అంతరాయం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా Outlook, Microsoft Teams, Microsoft 365, Copilot వంటి సేవలు ప్రభావితమవడంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 12న ఏర్పడిన ఈ అంతరాయం ఇంకా కొనసాగుతోంది. భారత్‌లోనూ పలు రంగాలపై దీని ప్రభావం పడింది. ముఖ్యంగా విమానయాన సంస్థల కార్యకలాపాలు, కస్టమర్ సపోర్ట్ సేవలకు ఆటంకం(Microsoft Global Outage) ఏర్పడింది.

విమాన సర్వీసులపై ప్రభావం
మైక్రోసాఫ్ట్‌ సేవల్లో సాంకేతిక సమస్యల కారణంగా ఢిల్లీలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. స్పైస్‌జెట్‌కు చెందిన మూడు విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి పుణె, లేహ్‌, ముంబై వెళ్లాల్సిన విమానాలు రద్దు(Microsoft Global Outage) కాగా.. మరో రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇండిగో సంస్థ తన ఈ-మెయిల్ సపోర్ట్ సేవలు ప్రభావితమైనట్లు ప్రకటించింది. అత్యవసర సహాయం కోసం వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌, 6E Skai చాట్‌బాట్‌ను ఉపయోగించాలని ప్రయాణికులకు సూచించింది. విమానాల సమయాలు, రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపింది. ఎయిర్‌ ఇండియా మాత్రం తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదని ప్రకటించింది. ఈ-మెయిల్ సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. ఇతర కమ్యూనికేషన్ ఛానళ్లు యథావిధిగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.

ఖైదీల విడుదలకు ఆటంకం
మైక్రోసాఫ్ట్‌ సేవల అంతరాయం అమెరికాలోని ప్రభుత్వ కార్యకలాపాలపైనా ప్రభావం చూపింది. కొలరాడో రాష్ట్రంలోని అరాపహో కౌంటీ డిటెన్షన్‌ ఫెసిలిటీలో ఆన్‌లైన్ బెయిల్ చెల్లింపుల ప్రక్రియకు ఆటంకం(Microsoft Global Outage) ఏర్పడింది. ఖైదీల బెయిల్‌ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించినప్పుడు సంబంధిత అధికారులకు రావాల్సిన ఈ-మెయిల్ నోటిఫికేషన్లు అందకపోవడంతో బెయిల్ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో అత్యవసరంగా బెయిల్ చెల్లించాల్సిన వారు జైలుకు నేరుగా వచ్చి చెల్లింపులు చేయాలని అధికారులు సూచించారు.

ఏ సేవలపై ప్రభావితం?
మైక్రోసాఫ్ట్‌ సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా పలు అప్లికేషన్లు ప్రభావితమయ్యాయి.
Outlook: ఈ-మెయిల్స్ పంపడం, స్వీకరించడం, మెయిల్‌బాక్స్‌లను యాక్సెస్ చేయడంలో సమస్యలు.
Microsoft Teams: క్యాలెండర్, మీటింగ్ షెడ్యూలింగ్ వంటి సేవల్లో అంతరాయం.
Microsoft 365: Exchange Online ఆధారిత సేవల్లో సమస్యలు.
Copilot: చాట్ సేవలు, ఈ-మెయిల్స్‌, క్యాలెండర్‌ వంటి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు.
Microsoft Planner, To Do, Power BI, Defender వంటి మరికొన్ని సేవల్లోనూ సమస్యలు నమోదయ్యాయి.
అయితే Teamsలో గ్రూప్‌ చాట్స్‌, ఛానల్ మెసేజ్‌లు, ఆన్‌లైన్ మీటింగ్‌లలో పాల్గొనడం వంటి ప్రధాన సేవలు చాలావరకు పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

సమస్య ఎక్కడ వచ్చింది?
మైక్రోసాఫ్ట్‌ వివరణ ప్రకారం.. తమ మౌలిక సదుపాయాల్లో కొన్ని సర్వర్లు అనూహ్యంగా అందుబాటులో లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. పలు ప్రాంతాల్లో సర్వర్లపై పెరిగిన లోడ్‌, ట్రాఫిక్ నిర్వహణలో ఏర్పడిన సమస్యలను సంస్థ గుర్తించింది. ప్రభావిత సర్వర్లను పునరుద్ధరించే పనులు చేపట్టింది. అయితే సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సేవలు పాక్షికంగా పునరుద్ధరించినప్పటికీ పూర్తిస్థాయిలో స్థిరమైన సేవలు అందుబాటులోకి రాలేదని సంస్థ తెలిపింది. టెక్నికల్ ప్రాబ్లంపై మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ చార్లెస్ లమన్నా స్పందించారు. ఈ అంతరాయం(Microsoft Global Outage) వెనుక సైబర్ దాడి ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సమస్యపై పూర్తి వివరాలను సేవలను పునరుద్ధరించిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.

2024లోనూ సేమ్‌ ప్రాబ్లం..!
గతంలో 2024 జూలైలోనూ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్ వ్యవస్థలు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ CrowdStrike అందించిన తప్పు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా Windows కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ సమస్య తలెత్తింది. విమానయానం, బ్యాంకింగ్, ఆసుపత్రులు సహా పలు రంగాల కార్యకలాపాలు (Microsoft Global Outage) ప్రభావితమయ్యాయి. అయితే 2024లో జరిగిన CrowdStrike ఘటనకు, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ సేవల్లో ఏర్పడిన అంతరాయానికి సంబంధం లేదు. ఇవి రెండు వేర్వేరు సాంకేతిక సమస్యలు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సేవలు ఒకదానిపై మరొకటి ఆధారపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అంతరాయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో తాజా ఘటన మరోసారి స్పష్టం చేసింది.