రాజ్యాంగానికి విఘాతం.. పౌరుల హక్కులు కాలరాస్తున్నారు
Kalva Sujata on Modi: దేశ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ కొట్లాడుతుందని కాల్వ సుజాత చెప్పారు. ప్రతీ పౌరుడికి ఓటు వేసే హక్కు ప్రజా స్వామ్యం కల్పిస్తే... అలాంటి హక్కును కాలరాయడం కరెక్ట్ కాదన్నారు. తొలగించిన 13కోట్ల ఓటర్లు అందరూ కాంగ్రెస్ ఓటర్లా? అని ప్రశ్నించారు. ఓటు చోరీపై దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలపై Popular TV Network తో ప్రత్యేకంగా మాట్లాడారు

Kalva Sujata on Modi: రాజ్యం కల్పించిన హక్కును ఎన్నికల సంఘం కాలరాస్తుందని తెలంగాణ ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కాల్వ సుజాత అన్నారు. ఓటు చోరీపై దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలపై Popular TV Network తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలిపే వారిపై దాడు చేయడం కరెక్ట్ కాదన్నారు. మహిళలతో అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించడం దారుణమన్నారు. పోలీసుల ముసుగులో కొంతమంది రౌడీలు వచ్చి నిరసన కారులపై దాడులు చేశారని మండిపడ్డారు. జ్ఞానేష్ కుమార్‌కి నోటీసులు ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయిస్తే అక్కడ కూడా న్యాయం జరగలేదన్నారు. ఎవరి ప్రోద్భలంతో రాహుల్ గాంధీకి నోటీసులు ఇస్తున్నారో దేశ ప్రజలకు అర్థం అవుతుందని చెప్పారు. న్యాయస్థానాల్లో న్యాయం జరగకపోయినా నిరసనలు చేయడం మాత్రం ఆపేదేలేదన్నారు. ఓటు చోరీపై ఆందోళనలు కొనసాగిస్తామని కాల్వ సుజాత స్పష్టం చేశారు.
ఓటు చోరీకి గురైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ లొల్లి కాదని.. దేశ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ కొట్లాడుతుందని కాల్వ సుజాత చెప్పారు. ప్రతీ పౌరుడికి ఓటు వేసే హక్కు ప్రజా స్వామ్యం కల్పిస్తే… అలాంటి హక్కును కాలరాయడం కరెక్ట్ కాదన్నారు. తొలగించిన 13కోట్ల ఓటర్లు అందరూ కాంగ్రెస్ ఓటర్లా? అని ప్రశ్నించారు. దేశంలోని సామాన్య ప్రజల తరపున కాంగ్రెస్ ఎప్పుడూ కొట్లాడుతుందని కాల్వ సుజాత స్పష్టం చేశారు.


