Indiramma Illu Payment Status

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని ఫైనల్ బిల్లు కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త చేరవేసింది. త్వరలోనే ఫైనల్ బిల్లుకు సంబంధించిన నగదును జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు మంత్రి. పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌ ఈ శుభవార్త చెప్పారు. ఇల్లు పూర్తయినా ఇంకా ఫైనల్ బిల్లు రాలేదని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. త్వరలోనే మీఖాతాల్లో నగదు జమ(Indiramma Illu Payment Status) చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా గృహాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని చెప్పారు మంత్రి పొంగులేటి. ఈపథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షల చొప్పున .. మొత్తం రూ. 40వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కాని అర్హులైన పేదలు నిరాశ చెందవద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం దశల వారీగా .. ఈపథకాన్ని నిరంతరం అమలు చేస్తోందని చెప్పారు. మూడు, నాలుగు విడతల్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరకీ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటనతో ఒకవైపు ఇళ్లు రాని వాళ్లు.. మరోవైపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని .. ఫైనల్ బిల్లు(Indiramma Illu Payment Status) కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది పేదల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. త్వరలోనే ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేరుస్తుందనే నమ్మకం వారిలో వ్యక్తమవుతోంది.