జోగి మేఘనను చంపేందుకు కుట్ర…?
Jogi Meghana: జోగి మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్ సహా కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి కోదాడకు వెళ్తున్న సమయంలో మేఘన ప్రయాణిస్తున్న కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన ఘటన తాజాగా చర్చనీయాంశమైంది

Jogi Meghana: మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన కారుకు ప్రమాదం జరిగింది. కేసు పని మీద ఇబ్రహీంపట్నం నుంచి కోదాడకు తిరిగి వెళ్తున్న సమయంలో జోగి మేఘన కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో జోగి మేఘన కుటుంబం బయటపడింది. ఈ క్రమంలో తమను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. భద్రతను పెంచాలని కోరుతున్నారు. కోదాడకు చెందిన మేఘనకు జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌తో 2025 మే 28న వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొద్దికాలానికే తనకు వేధింపులు మొదలయ్యాయని మేఘన ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశారని, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని పేర్కొంటూ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
నా భర్త సంసారానికి పనికిరాడు: జోగి మేఘన(Jogi Meghana )
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జోగి రమేష్ నివాసంలో మేఘన కుటుంబ సభ్యులు పంచాయతీ నిర్వహించారు. తన భర్త సంసారానికి పనికిరాడని.. అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. రెండు నెలల క్రితం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా, జోగి మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్ సహా కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి కోదాడకు వెళ్తున్న సమయంలో మేఘన ప్రయాణిస్తున్న కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన ఘటన తాజాగా చర్చనీయాంశమైంది.
ప్లీజ్.. నాకు సెక్యూరిటీ పెంచండి: మేఘన
తనను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరుగుతున్నాయని మేఘన ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రత పెంచాలని కోరుతున్నారు. ఇప్పటికే పోలీసులను ఆశ్రయించిన ఆమె ఇప్పుడు రక్షణ కోసం కూడా ప్రయత్నించడం ఈ వ్యవహారాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. కుటుంబ వివాదం, వరకట్న ఆరోపణలు, ప్రాణభయం, రోడ్డు ప్రమాదం.. ఇలా వరుస పరిణామాలతో జోగి కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, జోగి మేఘన వ్యవహారంపై మాజీ మంత్రి రమేష్ టీడీపీపై గతంలో ఆరోపణలు చేశారు. జోగి మేఘన వెనుక తెలుగుదేశం పార్టీ నేతలు, మైలవరం ఎమ్మెల్యే ఉన్నారంటూ ఆరోపించారు. ఆ తర్వాత జోగి మేఘన ఏపీ మహిళా కమిషన్‌ను సైతం ఆశ్రయించారు. ఇప్పుడు ఆమె ప్రయాణిస్తున్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం మరింత సంచలనంగా మారింది. అయితే ఏపీ ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పిస్తుందా..? లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది..



