HomeEntertainmentసలార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్ డేట్

సలార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్ డేట్

Published on

పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ నటించే సలార్ కి సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చేసింది. సలార్ సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ‘సలార్: పార్ట్ 1 – సీజ్‍ఫైర్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రికార్డులన్నీ బద్దలుకొడుతుందని ఆశిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సలార్‌కు దర్శకత్వం వహిస్తుండడం వల్ల కూడా క్రేజ్ ఏర్పడింది. సెప్టెంబర్ 28న ‘సలార్: పార్ట్ 1 – సీజ్‍ఫైర్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‍గా రిలీజ్ కానుంది. సలార్ సీజ్‍ఫైర్ మూవీ ట్రైలర్ రిలీజ్‍కు చిత్ర యూనిట్ డేట్ ఖరారు చేసిందని, ఈ ఆదివారం అది విడుదల అవుతుందని తెలుస్తోంది.

Latest articles

More like this