HomeEntertainmentప్రభాస్ మూవీ సలార్..లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ మూవీ సలార్..లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది

Published on

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కొత్త సినిమా సలార్ గురించి ఎప్పుడు అప్ డేట్ వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న ఇది విడుదల కానుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు సలార్ మూవీ మేకర్స్‌. డిసెంబర్‌ 1వ తేదీ రాత్రి 7.19 గంటలకు ‘సలార్‌’ చిత్రం ట్రైలర్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘సలార్’ మూవీకి సంబంధించిన టాకీ పార్టును చిత్ర యూనిట్ ఇటీవలే విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని చెబుతున్నారు. ఫస్ట్ పార్ట్ ‘సలార్: సీజ్‌ఫైర్‌’ పేరుతో విడుదల కాబోతుంది. ట్రైలర్ కోసం 20 రోజులు ఆగాల్సిందే.

Latest articles

More like this