HomeEntertainmentనటుడు విజయ్ ఆంటోని కూతురి సూసైడ్ నోట్

నటుడు విజయ్ ఆంటోని కూతురి సూసైడ్ నోట్

Published on

విలక్షణ నటుడు విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. హీరో విజయ్ ఆంటోని -ఫాతిమా 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు మీరా ఆత్మహత్యకు పాల్పడడం షాక్ కి గురిచేసింది. విజయ్ కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్డులో నివాసం ఉంటోంది.కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని, ఫాతిమా బాగా కుంగిపోయారు. కీల్పాక్కంలోని శ్మశానవాటికలో మీరా అంత్యక్రియ లు బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల కడసారి నీరాజనాల మధ్య ముగిశాయి. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌, నటుడు కార్తీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌, ప్రభుదేవా సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మీరాకు నివాళులర్పించారు.

మీరా చదువుకున్న పాఠశాల విద్యార్థులు.. మీరాను ఆఖరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్జీవంగా ఉన్న మీరాను చూసి.. తన ఫ్రెండ్స్ కన్నీరు పెట్టుకున్నారు.కుమార్తె మీరా ఆత్మహత్య తమిళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 ఏళ్ల మీరా గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నట్లు తెలిసింది. మీరా… విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతుల పెద్ద కుమార్తె. ఆమె 2007లో జన్మించింది. డాక్టర్ అవ్వాలన్నది ఆమె కల. అదే ఆకాంక్షతో చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. మీరా చదువులో టాపర్ గా నిలిచేది.ఆమె ఇటీవల పాఠశాలలో కల్చరల్ సెక్రెటరీగా ఎన్నికైంది.మీరా గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, అందుకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 19న మీరా గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మీరాది ఆత్మహత్య అని తేలింది. పోలీసులు మీరా సూసైడ్ నోట్‌ను గుర్తించారు.

“లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్” అనే కోట్‌తో ఆమె లెటర్ రాసినట్లు తెలిసింది. ఈ లేఖ గురించి పోలీసు అధికారులు పెద్దగా వెల్లడించలేదు. మీరా ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.మీరాకు చీకటి అన్నా, చీకట్లో ఉండాలన్న, సింగిల్‌గా ఉండాలన్నా కూడా భయపడిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి దారుణ నిర్ణయం ఎలా తీసుకుందో అర్థం కావడం లేదని తెలిపింది. భార్యా పిల్లల పట్ల ఎంతో ప్రేమను వ్యక్తపరిచే విజయ్ ఆంటోనికి ఇలా జరగడం చాలా బాధాకరం నటి సుధ తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోని, ఫాతిమాల పెద్ద కుమార్తె అయిన మీరా ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్‌ ఆంటోని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

చెన్నైలోని చర్చి పార్క్ కాలేజ్‌లో మీరా ఇంటర్ సెంకడియర్ చదువుతోంది.మంగళ వారం తెల్లవారుజామున మూడు గంటలకు తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సలీం (2014), పిచైకరన్ (2016), సైతాన్ (2017), యమన్ (2017), కొలైగరన్ (2019) వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో విలక్షణంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బిచ్చగాడు మూవీ విజయ్ ఆంటోని క్రేజ్ ని పెంచింది. గతంలో విజయ్ ఆంటోని తండ్రి మద్యానికి బానిసవ్వడంతో.. ఒక సమయంలో బాగా ఎమోషనల్ అయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్లు విజయ్ పేర్కొన్నాడు.దీంతో విజయ్ తన 7 ఏళ్ళ వయసు నుంచే తండ్రి లేకుండా పెరిగాడు. ఇక ఇప్పుడు విజయ్ కూతురు కూడా ఆత్మహత్య చేసుకునే మరణించడంతో విజయ్ తట్టుకోలేకపోతున్నాడు. తన అభిమాననటుడికి ఇలా జరగడంతో ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.

Latest articles

More like this