Dhanush Political Entry Clarification

రూమర్స్‌కి చెక్
తన రాజకీయ ఆరంగేట్రంపై కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు సినీ నటుడు ధనుష్ తెరదించారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని.. ఏ నాయకుడి అండా లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా బీజేపీ మద్దతుతో ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారానికి చెక్ పెట్టారు. పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు స్వయంగా తానే(Dhanush Political Entry Clarification) సమాధానమిచ్చారు. అభిమాన సంఘాలను సంక్షేమ సంస్థలుగా మార్చడం.. భారీగా సభ్యత్వాలు పెంచడం వంటి పరిణామాలతో ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. బీజేపీ వెనుక ఉండి నడిపిస్తోందన్న ఆరోపణలూ వినిపించాయి. అయితే తనను ఏ రాజకీయ శక్తీ నడిపించడం లేదని ధనుష్ పరోక్షంగా స్పష్టం చేశారు. దేవుడు, అభిమానులు, ప్రజలు మాత్రమే తనకు అండగా ఉన్నారని తేల్చి చెప్పారు. చెన్నైలో జరిగిన ‘ఓమ్’ సినిమా ఆడియో వేడుకలో ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

నాలుగు ట్యూషన్‌ సెంటర్లు
ఇదే క్రమంలో ధనుష్ తన అభిమాన సంఘం ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నాలుగు ఉచిత ట్యూషన్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీటిలో మూడు చెన్నైలో, మరొకటి కన్యాకుమారిలో ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయి సౌకర్యాలతో, ఏసీ వసతితో ఈ కేంద్రాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండేళ్లలో ఈ కార్యక్రమాన్ని తమిళనాడు అంతటా విస్తరించాలన్నదే తన ఆలోచన అని చెప్పారు(Dhanush Political Entry Clarification) ధనుష్‌. అభిమానుల సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు.. రాజకీయ పార్టీల మద్దతుపై ఆరోపణలు మరోవైపు.. ఈ నేపథ్యంలో తన వెనుక ఎవరూ లేరని, ప్రజలే తన బలమని ధనుష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి భవిష్యత్తులో ఆయన నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా? లేక సేవా కార్యక్రమాలకే పరిమితమవుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

నాదే తప్పు
మరోవైపు తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు ధనుష్‌. ‘ఓమ్’ ఆడియో వేడుకలో చోటుచేసుకున్న గందరగోళంపై ఎక్స్‌ వేదికగా(Dhanush Political Entry Clarification) స్పందించారు. సామర్థ్యానికి మించి అభిమానులు తరలిరావడంతో.. సరైన పాసులు ఉన్న వేలాది మంది కూడా లోపలికి వెళ్లలేకపోయారని చెప్పారు. ఈ అసౌకర్యానికి పూర్తి బాధ్యత తనదేనని అంగీకరించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.

ఇక ‘ఓమ్’ సినిమాను ఐదుగురు హీరోలున్న మల్టీస్టారర్ చిత్రంగా ధనుష్ అభివర్ణించారు. ఇందులో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నజీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 20న సినిమా విడుదల కానుంది.