ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. సాగునీటి రంగంపై మాస్టర్ ప్లాన్!
సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. నిర్లక్ష్యంతో దెబ్బతిన్న ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. సాగునీటి రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Chandrababu Lift Irrigation Projects
ఒకవైపు ఎల్‌నినో.. మరో వైపు వరదలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. నిర్లక్ష్యంతో దెబ్బతిన్న ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. సాగునీటి రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీటి భరోసా కల్పించడం, ప్రాజెక్టుల నిర్వహణను మెరుగుపరచడం, సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందడం వంటి అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Lift Irrigation Projects) దృష్టి సారించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, ఇరిగేషన్ భూముల వినియోగం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
పటిష్టమైన పర్యవేక్షణ
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరమ్మతులకు గురైన 789 ఎత్తిపోతల పథకాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించారు. ఈ పథకాల పునరుద్ధరణకు మొత్తం రూ.632.07 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. పనులన్నీ పూర్తయితే సుమారు 7.49 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరంగా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు. అధికారుల నివేదికపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులను అత్యంత ప్రాధాన్యతతో వెంటనే చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పథకాల పరిస్థితిని అంచనా వేయకుండా కేవలం కార్యాలయాల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ప్రతి పథకంలో ఉన్న సమస్యలను గుర్తించి, అవసరమైన మరమ్మతులపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు(Chandrababu Lift Irrigation Projects) సూచించారు. టెండర్లు వెంటనే పిలిచి పనులు ప్రారంభించాలని, వచ్చే జూన్ నాటికి అన్ని పథకాలు అందుబాటులోకి రావాలని గడువు విధించారు. ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణతోపాటు వాటి నిర్వహణపైనా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకసారి మరమ్మతులు చేసిన తర్వాత మళ్లీ అవి నిరుపయోగంగా మారకుండా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని సూచించారు. జలహారతి కార్పొరేషన్ ద్వారా ఈ పథకాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలవారీగా బాధ్యతలను నిర్దేశించి, అవసరమైతే ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీర్ లేదా సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను నియమించాలని సూచించారు. దీనివల్ల పథకాల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంతోపాటు సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో ని సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షలో చర్చ జరిగింది. సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులను జలహారతి కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలో వాటర్ రెగ్యులేటరి కమిషన్ తీసుకొచ్చే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 ప్రాజెక్టులను రాబోవు రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
#ChandrababuNaidu
#AndhraPradesh— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 11, 2026
సౌర విద్యుత్ ఉత్పత్తి
సాగునీటి రంగానికి అవసరమైన విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతోపాటు అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించే దిశగా సీఎం కీలక సూచనలు చేశారు. జలవనరుల శాఖ, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని 4,171 ఎకరాల భూములను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకునే ప్రతిపాదనలను అధికారులు వివరించారు. ఈ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే 903.1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ కాలువలపైనా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి (Chandrababu Lift Irrigation Projects) సూచించారు. సాగు సమయంలో ఎత్తిపోతల పథకాలకు నిరంతరాయ విద్యుత్ అందేలా చూడాలని, అవసరాలకు మించి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. తద్వారా ఒకవైపు రైతులకు విద్యుత్ సరఫరా మెరుగుపడటంతోపాటు మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో అమలవుతున్న నియంత్రణ వ్యవస్థ తరహాలో జలవనరుల శాఖకు ప్రత్యేకంగా వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండున్నరేళ్లు టార్గెట్
రాష్ట్రంలో ప్రాధాన్యతగా గుర్తించిన 36 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాబోయే రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత రానివ్వబోమని స్పష్టం చేస్తూ.. అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు(Chandrababu Lift Irrigation Projects) భరోసా ఇచ్చారు. పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, శాఖల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తంగా చూస్తే.. 789 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, 903 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి, 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి లక్ష్య నిర్దేశం.. ఈ మూడు అంశాల ద్వారా రాష్ట్ర సాగునీటి రంగానికి కొత్త దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.



