అసోంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఐదు బోగీలు
Assam Train Accident: అసోంలో రైలు ప్రమాదం జరిగింది. ట్రైన్ వేగాన్ని నియంత్రించే సమయంలో అదుపు తప్పడంతో ఆరు బోగీలు పట్టాల నుంచి అదుపు తప్పాయి.

Assam Train Accident: అసోంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న రైలు ప్రమాదం పెను విషాదాన్ని తప్పించింది. కోల్‌కతా నుంచి మిజోరాంలోని సైరంగ్‌కు వెళ్తున్న కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గౌహతి సమీపంలోని కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా పరిధిలో ఉన్న దిగారు రైల్వే స్టేషన్ వద్ద ఉదయం సుమారు 6.54 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మరో రైలుకు దారి ఇచ్చేందుకు ఎక్స్‌ప్రెస్ రైలును స్టేషన్‌లోకి తీసుకువస్తున్న సమయంలో లోకో పైలట్ వేగాన్ని అదుపు చేయలేకపోయినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. దీంతో రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పినట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికులకు స్వల్ప గాయాలు
ఈ ఘటనలో ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. కొందరికి స్వల్ప గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రైలులోని ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేశారు. మరోవైపు దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయి.
#WATCH | Assam: A locomotive and five coaches of the Kolkata-Sairang Express (Train No. 13125) derailed at Digaru Railway Station in Kamrup (Metro) district at around 6:54 am today.
According to Northeast Frontier Railway, all passengers are safe, and no injuries have been reported. Passengers are being transported to their destinations by an alternative train. Relief and rescue operations have been launched.
(Visuals from the spot)
— ANI (@ANI) November 11, 2026
వైరల్‌గా మారిన వీడియో
ఇదిలా ఉండగా, రైలును అదుపులోకి తీసుకురావడానికి లోకో పైలట్ ప్రయత్నిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వేగాన్ని తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ రైలు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.



