ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్.. 23 పట్టణ స్థానిక సంస్థల్లో 26న పోలింగ్
ఏపీలో పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు.

AP Municipal Elections 2026
ఏపీలో పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన షెడ్యూల్(AP Municipal Elections 2026)ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇక్కడ నంబర్ 26న పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 30న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇంతకు ముందులాగే ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతోంది.
23 పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 14 నుంచి 16వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 17న నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 19 వరకు నామినేషన్ల పరిశీలనకు గడువు ఉంటుంది. అయితే గతంలో న్యాయపరమైన వివాదాలు, వార్డుల పునర్విభజన కారణంగా ఈ 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఇటీవల హైకోర్టులో న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతోపాటు .. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. దీంతో ఎన్నికల(AP Municipal Elections 2026) నిర్వహణకు మార్గం సుగమమైంది. నాలుగు నగరపాలక సంస్థలు శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలోని 260 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని 749 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే నగర పంచాయతీల విషయానికి వస్తే.. ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా), రాజాం (విజయనగరం), పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు (పశ్చిమగోదావరి), చింతలపూడి (ఏలూరు), గుడివాడ, తాడిగడప (కృష్ణా), పొన్నూరు (గుంటూరు), నరసరావుపేట (పల్నాడు), కందుకూరు (ప్రకాశం), పొదిలి (మార్కాపురం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), శ్రీకాళహస్తి (తిరుపతి), బి.కొత్తకోట (అన్నమయ్య), బాపట్లలో ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి.



