ఏపీకి మరో తుఫాన్ ముప్పు
Andhra Pradesh Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం క్రమంగా బలపడి అప్పపీడనంగా మారనుంది. అల్పపీడనం తీవ్ర తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Andhra Pradesh Cyclone Alert : ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం క్రమంగా బలపడి అప్పపీడనంగా మారనుంది. అల్పపీడనం తీవ్ర తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ నిపుణులు గుర్తించారు. ఆవర్తనం ప్రభావంతో 23 నాటికి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న రోజుల్లో మరింత బలపడుతోందని అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఏపీలో ని కోనసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది కనుక అది ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిశా తీరాల వైపునకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే తుఫానుగా మారి ఏపీలోని తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. గంటలకు 100 కి.మీ పైబడిన వేగంతో బలమైన గాలులు, సముద్రంలో అలల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత లేదు. దీంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.



