ఈమధ్యకాలంలో ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా ఉలవచారు కనిపిస్తోంది. మనం ఆహారంలో ఎక్కువగా కందిపప్పు, పెసరపప్పు, శెనగపప్పు తీసుకుంటాం. అయితే వీటన్నింటి కంటే ఉలవల్లో ఎక్కువ పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా? ఉలవలు క్రీస్తు పూర్వం 2000 నుండి ప్రజలు తింటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. చిన్నప్పుడు మన తాత, ముత్తాతలు ఆవులు, గేదెలకు ఉలవలు ఉడకబెట్టి పెట్టేవారు. అంటే వాటికి ఎంత బలం ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.
అంతేకాదు ఉలవలు తిన్న పశువులు ఎక్కువగా పాలు ఇస్తాయని అనేవారు. కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఫైబర్, పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. వర్షాకాలం మరియు చలికాలంలో ఈ పప్పు తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఉలవలను అనేక రకాలుగా వండుకోవచ్చు. ఉలవచారు, ఉలవలు మొలకల చారు, ఉలవలు ఉడికించి తాలింపు ఎక్కువగా తింటారు. దీన్ని ఎలా తీసుకున్నా పప్పులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. వారానికి ఒకసారి వీటిని తినడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.ఉలవపప్పులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లను కరిగించి బయటకు పంపి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. కాబట్టి మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే, పప్పుతో సూప్ తయారు చేసి, క్రమం తప్పకుండా తాగండి. మీరు త్వరలో మంచి ఫలితాలను చూస్తారు.