పాత రోజుల్లో బియ్యం వండి వార్చేవారు. కానీ ఇప్పుడు లైఫ్ బాగా మారిపోయింది. ఇప్పుడు రెండుగ్లాసుల బియ్యం కుక్కర్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చాక దింపేస్తారు. చాలామంది మహిళలు అన్నాన్ని ప్రెజర్ కుక్కర్లో వండుతుంటారు. చాలామంది మహిళలు వంట చేయడానికి ఎంచుకునే పరికరం ప్రెజర్ కుక్కర్. దీని సహాయంతో అన్నం, కూరగాయలు, పప్పులు మొదలైనవన్నీ నిమిషాల మీద ఉడికిపోతాయి. పైగా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇలా ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తినకూడదా.. అయితే అన్నం ఎలా వండాలి. అసలింతకూ ప్రెజర్ కుక్కర్లో వండిన అన్నం తినొచ్చా? తినకూడదా? ప్రెజర్ కుక్కర్ లో వండే వంట విషయంలో ఎవరిని నమ్మాలి.
ప్రెజర్ కుక్కర్లో ఆహారం ఉడుకుతున్నప్పుడు ఆవిరి బయటకు వెళ్లదు. ఈ ఆవిరి కాస్తా ఉష్టోగ్రతగా రూపాంతరం చెంది ఆహారం తొందరగా ఉడకడానికి సహాయపడుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారం ఉడుకుతుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది కాదని కొందరంటే, ఎక్కువ ఉష్టోగ్రత ఉన్నా చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇది ఆరోగ్యం అంటారు ఇంకొందరు. కుక్కర్లో వండే ఆహారాన్ని బట్టి దాని ఫలితాలుంటాయని అంటున్నారు. అన్నం కుక్కర్లో వండితే అది చాలా బరువుగా మారుతుందంటారు. పిండిపదార్థాలను ఇలా ప్రెజర్ కుక్కర్లో ఉడికించినప్పుడు యాక్రిలామైడ్ అనే రసాయనాన్ని ఏర్పరుస్తాయి. ప్రతిరోజూ కుక్కర్లో వండిన అన్నాన్ని తింటే యాక్రిలామైడ్ కారణంగా క్యాన్సర్, వంధ్యత్వం, నాడీ సంబంధ జబ్బులు చాలా తొందరగా చుట్టుముడతాయి.
ప్రెజర్ కుక్కర్ లో వంట గురించి చెబుతూ బిజీ రోజుల్లో, ఎప్పుడైనా తప్పని పరిస్థితులల్లో ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండుకుని తింటే పర్వాలేదు. కానీ ప్రతిరోజూ ఇదే పద్దతి ఫాలో అవ్వడం ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు. కుక్కర్ వినియోగం మీద ఆధారపడకుండా ఇతర పద్దతుల్లో వంట చేయడానికి మెల్లిగా అలవాటు పడాలి. తినే ఆహారం రుచిగా ఉందా లేదా అన్నదే కాదు, ఎలా వండారనేది ముఖ్యం కూడా.. వారానికి ఒకసారైనా మట్టిపాత్రలో వంట చేయడం అలవాటు చేసుకోండి. అంతేకాదు చిన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇత్తడి పాత్రల్లో వంటలు చేసేవారు. అలాంటి ఆహారం తిన్న వారు 90, వంద సంవత్సరాలు బతికేవారు. మనం కూడా సంప్రదాయ వంట పద్ధతుల్ని పాటించడం మనకే కాదు మన భావితరాలకు కూడా మంచిది.