జగన్‌కి షాక్.. అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
YS Jagan ED Cases: జగన్ అక్రమాస్తుల కేసుతో కీలక పరిణామం జరిగింది. కేసును రోజువారీ విచారణ జరపాలని ఈడీ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో రోజువారీ విచారణ జరిపేందుకు కోర్టు నిర్ణయం తీసుకుంది..

YS Jagan ED Cases: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కి షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం జరిగింది. ఈడీ కేసులను విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా రోజువారీ విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. డైలీ విచారణకు హాజరుకావాలని న్యాయవాదులకు ఈడీ సూచించింది. సీబీఐ కోర్టులో పదేళ్లుగా 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో ఈడీ కేసుల విచారణ ఎటు తేలడం లేదు. దీంతో ఈడీ కేసులను రోజువారీ విచారించాలని అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు సీబీఐ కేసులను మాత్రమే కోర్టు విచారిస్తోంది. అయితే తమ కేసుల విషయంలోను చొరవ తీసుకోవాలని.. తమ కేసులను కూడా విచారించాలని హైకోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఈకేసును వీలైనంత త్వరగా తేల్చేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని ఈడీ కోరింది. ఈపరిణామాల నేపథ్యంలో సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈడీ కేసులను సీబీఐ కోర్టు విచారించే అవకాశం ఉంది.
కేసుల నేపథ్యంలో చేస్తే.. జగన్‌కు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులపై 2011లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. మే 2012లో జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో 18నెలలు తర్వాత సెప్టెంబర్ 2013న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 2016–2021 మధ్య ఈ కేసులకు సంబంధించి ఈడీ తొమ్మిది మనీలాండరింగ్ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేసింది. తొమ్మిది మనీలాండరింగ్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులు, నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా విచారణ ముందుకు సాగలేదు. దీంతో జగన్‌కు సంబంధించిన కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. విచారించిన సీబీఐ కోర్టు రోజువారి విచారణకు ఆదేశించింది.



