Visakha CII Partnership Summit 2026

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణకు కీలక వేదికగా విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు గురువారం జరగనుంది. ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వస్తారని తొలుత ప్రచారం జరిగింది. అనివార్య కారణాల వల్ల హాజరుకావడం లేదని తెలుస్తోంది. అమిత్‌షా విశాఖ(Visakha CII Partnership Summit 2026) పర్యటనకు రావడం లేదని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. అయితే సదస్సు ప్రారంభోత్సవానికి అమిత్‌షా ప్లేస్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపింది.

పెట్టుబడులే లక్ష్యంగా..
విశాఖ వేదికగా నవంబర్ 12 గురువారం 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నవంబర్‌ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. సీఐఐ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ విశ్వాసం వంటి కీలక అంశాలపై ఈ వేదికగా చర్చలు జరగనున్నాయి. దాదాపు 58 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు(Visakha CII Partnership Summit 2026) ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించడంతో పాటు, వివిధ రంగాల్లో కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు కీలకంగా మారనుంది.

చివరి రోజు ఉపరాష్ట్రపతి రాక
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ముగింపు కార్యక్రమం నవంబర్‌ 13న జరగనుంది. ఈ సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల రాకతో విశాఖలో(Visakha CII Partnership Summit 2026) ఇప్పటికే సందడి నెలకొంది. అమిత్‌ షా పర్యటన రద్దయినప్పటికీ, పీయూష్‌ గోయల్‌ రాకతో ప్రారంభోత్సవ కార్యక్రమం యథావిధిగా జరగనుంది. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

భారీ బందోబస్త్
సీఐఐ సదస్సు నేపథ్యంలో నగరంలో సుమారు 3,500 మంది పోలీసులతో నిఘాపెట్టారు. ప్రధాన వేదిక వద్దనే దాదాపు 1,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సిరిపురం నుంచి సదస్సు ప్రాంగణం వరకు, మద్దిలపాలెం నుంచి ప్రాంగణం వరకు సెక్యూరిటీ టైట్ చేశారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో 7 నుంచి 10 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, డాగ్‌ స్క్వాడ్స్‌, బాంబు తనిఖీ బృందాలతో భద్రతను పటిష్టం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 12 ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాలను గుర్తించారు. వీటిలో మొత్తం 1,775 కార్లను నిలిపే అవకాశం ఉంది. వీఐపీలు(Visakha CII Partnership Summit 2026) సందర్శించే పర్యాటక ప్రాంతాలు, బీచ్‌ల వద్ద ప్రత్యేక విద్యుద్దీపాలంకరణ, పూల అలంకరణ, పచ్చదనం, పారిశుద్ధ్య పనులు చేపట్టారు. భోగాపురం విమానాశ్రయం, ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి నగరానికి వచ్చే మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిసరాల్లో వాహనాల మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నారు.