ఎస్పీకి విడదల రజిని ఫిర్యాదు
గుంటూరు జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కలిశారు మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని. చిలకలూరిపేటలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఎస్పీని కలిసి కంప్లైంట్ చేశారు. తనతో ఎస్ఐ ప్రియాంక అనుచితంగా ప్రవర్తించారని.. కిందకు తోసేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ చేసిన దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీశ్‌ను కోరారు ఆమె.

Vidadala Rajini Complains to Guntur SP
గుంటూరు జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కలిశారు మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని. చిలకలూరిపేటలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఎస్పీని కలిసి కంప్లైంట్ చేశారు. తనతో ఎస్ఐ ప్రియాంక అనుచితంగా ప్రవర్తించారని.. కిందకు తోసేశారంటూ ఫిర్యాదు(Vidadala Rajini Complains to Guntur SP)లో పేర్కొన్నారు. ఎస్ఐ చేసిన దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీశ్‌ను కోరారు ఆమె. ఒకవేళ ఎస్పై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని.. అక్కడే తెల్చుకుంటామన్నారు.
ఎస్పీని కలిసి తర్వాత విడదల రజిని(Vidadala Rajini ) మీడియాతో మాట్లాడారు . రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పరిస్థితులు చూస్తుంటే ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్దమైన పాలన జరగడం లేదని.. కేవలం రెడ్ బుక్ రాజ్యంగం మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సామన్యులకు ఇంకేక్కడ న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కేవలం అధికారపార్టీకి మాత్రమే మద్దతుగా పోలీసులు పనిచేస్తున్నారని.. కొన్నిచోట్ల అయితే టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు పనిచేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ఇక చిలకలూరిపేటలో అయితే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. తమ పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తూ, కిడ్నాప్‌లు చేసి నామినేషన్లు ఉపసంహరించుకునే పరిస్థితులు తీసుకొచ్చారని రజిని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి బెదిరింపులకు బయపడబోమని.. టీడీపీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటామన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టుమెట్లు ఎక్కుతామన్నారు. అధికారం ఎప్పడూ ఒకరిదగ్గరే ఉండదని.. అలా అని ప్రతిపక్షాలపై కక్ష సాధింపుదోరణికి పాల్పడితే రేపు మీపరిస్థితి ఇంతే ఉంటుందని హెచ్చరించారు.
అయితే ఈనెల 23న చిలకలూరిపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini )ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విడదల రజిని నివాసం దగ్గర యడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి పందుల బుల్లబ్బాయిని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. పోలీసులను ప్రశ్నించిన సమయంలో జరిగిన తోపులాటలో రజిని కిందపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పందించింది. చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంకపై విచారణకు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమెను అన్ని విధుల నుంచి తప్పించాలని సూచించింది. ఈక్రమంలో ఇప్పుడు ఎస్పీని విడదల రజిని కలవడం.. ఎస్ఐపై చర్యలు (Vidadala Rajini Complains to Guntur SP)తీసుకోవాలని కోరడం చర్చనీయాంశమైంది. రజిని కంప్లైంట్ తర్వాత ఎస్ఐపై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


