TDP Rayachoti Victory:

అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. 44 డివిజన్‌లలో ఒక్కచోట కూడా వైసీపీ పోటీ చేయలేదు. దీంతో రాయచోటి మున్సిపాలిటీలో టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. టీడీపీ గెలుపుతో ఆపార్టీ జెండా 20ఏళ్ల తర్వాత రెపరెపలాడింది. టీడీపీ గెలుపుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక విజయం(TDP Rayachoti Victory) అన్నారు మంత్రి. వైసీపీ ప్రజాదరణ కోల్పోయింది.. అందుకే ఆపార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదన్నారు. గడిచిన ఏదేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదుగనుకే పార్టీ నుంచి పోటీచేసేందుకు అభ్యర్థులు వెనక్కి తగ్గారన్నారు. నామినేషన్‌లు అడ్డుకున్నారనే ఆరోపణలను మంత్రి ఖండించారు. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి మంత్రే స్వయంగా స్వీట్స్ తినిపించారు.

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ఈసందర్భంగా మరోసారి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో.. గడిచిన రెండున్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్‌ చేశారు. శాంతికాముకుడిగా ప్రచారం చేసుకునే శ్రీకాంత్‌రెడ్డి అరాచకాలను ప్రజలందరూ చూస్తున్నారని చెప్పారు. గత పదేళ్లలో రాయచోటికి చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా.. గంజాయి, డ్రగ్స్ కల్చర్‌ తెచ్చి యువత జీవితాలను నాశనం చేశారని మంత్రి మండిపల్లి ఫైర్ అయ్యారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలకు కాదుకదా.. కనీసం ఆపార్టీ శ్రేణులకు అందుబాటులోలేకుండా.. ఎన్నికలకు ముందు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థుల దగ్గరకు వెళ్లి పోటీచేయాలని ప్రాదేపడ్డారని ఎద్దేవా చేశారు. వారు విజ్ఞులు కనుక స్వచ్ఛందంగా తప్పుకున్నారని మంత్రి అన్నారు. పోటీ నుంచి తప్పకున్న వైసీపీ అభ్యర్థులకు మంత్రి ధన్యవాదాలు చెప్పారు. ఇకపై ఆపార్టీ, ఈపార్టీ అని తేడా లేకుండా రాయచోటి పట్టణంలోని ప్రజలందరికీ ఇళ్లు, వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు (TDP Rayachoti Victory).

రాయచోటి పరిసర ప్రాంతాలలో యువతను మారక ద్రవ్యాల బారిన పడేలా చేసిన చేసిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఏ విధంగా ప్రకటిస్తారని శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనిభట్టి చూస్తేనే తెలుస్తుంది నీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేముందో అర్థమవుతుందన్నారు. వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి తనకు భద్రత కోసం జిల్లా ఎస్పీని, ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తే భద్రత కల్పిస్తుందని తెలిపారు. అలా కాకుండా తన వ్యక్తిగత భద్రత కోసం ఆయుధాలు కలిగిన వ్యక్తులను నియమించుకోవడం ఏంటని మంత్రి మండిపడ్డారు. ఎన్నికలలో ఎక్కడా కూడా హింసకు తావులేదని… ప్రత్యర్థ పార్టీలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉందని మంత్రి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడమే తమ లక్ష్యమని.. తమ పార్టీ నాయకుడు చంద్రబాబు ఇదే చెప్పారని మంత్రి స్పష్టం చేశారు. రాయచోటిలో మొత్తం 44 డివిజన్ లలో మూడు బీజేపీ, ఒకటి జనసేన, మిగతా 40 చోట్ల టీడీపీ ఎకగ్రీవం(TDP Rayachoti Victory) అయ్యాయి. రాయచోటి మున్సిపాలిటీలో  చైర్మన్ అభ్యర్థి ఖాదర్ వల్లి షేక్ టీడీపీ నుంచి ఎంపికయ్యారు. కూటమి గెలుపునకు సహకరించిన పార్టీ నేతలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.