టీఎంసీకి సువెందు సవాల్.. బలపరీక్షకు సిద్ధమా

Suvendu Adhikari : వెస్ట్ బెంగాల్ సీఎం సువేందుకు అధికారి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీలో ఇప్పటికిప్పుడు బలపరీక్ష జరిగినా తమ ప్రభుత్వానికి 275 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ తరపున గెలిచిన 64మంది ఎమ్మెల్యేలు కూడా తమకే సపోర్ట్ చేస్తారని అన్నారు. 275 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌తో స్పష్టమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇటీవల కోల్‌కతాలోని చోర్బగాన్లో దుర్గా పూజ మండలం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 19మంది మరణించారు. ఈఘటనలో మరణించిన బాధిత కుటుంబాలను సీఎం సువెందు పరామర్శించారు. ప్రభుత్వం తరపున పరిహారం అందజేశారు. తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్లో టీఎంసీ చేసిన ఆరోపణలపై సీఎం సువెందు సీరియస్‌గా స్పందించారు. టీఎంసీ అన్నట్లుగా రేపే అసెంబ్లీలో బలపరీక్ష పెట్టమనండి. ఎవరి సత్తా ఎంటో తెలుస్తుందని సవాల్ చేశారు. మా సంఖ్య 275కు ఒక్కటి కూడా తగ్గదని ధీమా వ్యక్తం చేశారు.
ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సోషల్ మీడియా లేదా టీవీ చర్చల ద్వారా రాలేదని కౌంటర్ ఇచ్చారు. ప్రజల ప్రత్యక్ష మద్దతులో ఎన్నుకున్న సనాతన ప్రభుత్వమని చెప్పారు. అంతేకాదు భవానీపూర్‌లో మాజీ సీఎం మమతా ఓటమిపై కూడా మాట్లాడారు. గత 49ఏళ్లుగా వామపక్ష, టీఎంసీ పాలనలో పేరుకుపోయిన సమస్యలను బీజేపీ పరిష్కరిస్తుందని చెప్పారు. ప్రజలకు సంక్షేమంతో పాటు.. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీఎంసీలో అంతర్గత విభేదాలు తతెత్తుతున్నాయి. పార్టీ గుర్తు కోసం ఓవర్గం న్యాయం పోరాటం చేస్తోంది. ఈనేపథ్యంలో సువేందు అధికారి వ్యాఖ్యలు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈఏడాది జరిగిన సర్వత్రి ఎన్నికల్లో బెంగాల్లో 208 సీట్లో గెలిచి బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. టీఎంసీ 80 స్థానాలకు పరిమితం అయింది.



