ఇరుముడి హీరోయిన్ పెళ్లి.. ప్రియుడితో ఏడడుగులు
తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ప్రియా భవానీ శంకర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల ప్రియుడు రాజ్ వేల్‌ను వివాహం చేసుకున్నారు. నవంబర్ 11న చెన్నైలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది.

Priya Bhavani Shankar Wedding
సినీ పరిశ్రమలో పెళ్లంటే భారీ సెట్టింగులు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, కోట్లాది రూపాయల ఖర్చు, వారం పదిరోజుల పాటు జరిగే వేడుకలే గుర్తుకొస్తాయి. కానీ ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ అందుకు పూర్తి భిన్నంగా తన వివాహాన్ని ఎంతో నిరాడంబరంగా జరుపుకున్నారు. తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ప్రియా భవానీ శంకర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల ప్రియుడు రాజ్ వేల్‌ను వివాహం చేసుకున్నారు. నవంబర్ 11న చెన్నైలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకలో పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చిన ఈ జంట నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వేడుకలో ప్రియా(Priya Bhavani Shankar Wedding) ఎరుపు రంగు సంప్రదాయ చీరలో పెళ్లికూతురిగా మెరిసిపోగా.. రాజ్ వేల్ తెల్లటి పంచెకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
PriyaBhavani Shankar got married today 💍 https://t.co/lilOHQESbl
— Kolly Censor (@KollyCensor) November 11, 2026
పదేళ్ల ప్రేమాయణం!
ప్రియా, రాజ్ వేల్ బంధం ఇప్పటిది కాదు. వీరిద్దరూ కాలేజీ రోజుల్లోనే క్లాస్‌మేట్స్‌గా పరిచయమయ్యారు. అప్పట్లో మొదలైన స్నేహం కాలక్రమంలో ప్రేమగా మారింది. అలా దాదాపు పదేళ్లుగా ఒకరికొకరు ప్రేమించుకుంటూ తమ బంధాన్ని కొనసాగించారు. తన ప్రేమ విషయాన్ని ప్రియా(Priya Bhavani Shankar Wedding) ఎప్పుడూ దాచిపెట్టలేదు. ఇంటర్వ్యూల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ రాజ్‌తో తనకున్న అనుబంధం గురించి పలుమార్లు వెల్లడించారు. పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
తెలుగులో వరుస హిట్లు
ప్రియా భవానీ శంకర్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత టీవీ సీరియళ్లలో నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2017లో ‘మేయాద మాన్’ చిత్రంతో సినిమా ఫీల్డ్‌కి పరిచయం అయ్యారు. నటనతో అబ్బురపరుస్తూ.. తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని వరుస అవకాశాలు అందుకున్నారు ప్రియా భవానీ(Priya Bhavani Shankar Wedding). తెలుగులో ‘కల్యాణం కమనీయం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రియా.. ఆ తర్వాత గోపిచంద్ హీరోగా వచ్చిన భీమా చిత్రంలో నటించారు. నాగచైతన్య దూత వెబ్ సిరీస్‌తో తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.ఇటీవల సంచలన హిట్ సాధించిన ఇరుముడి సినిమాలోను నటించారు. జీబ్రా సినిమాల్లోను.. అలాగే కమల్‌హాసన్ భారతీయుడు 2లోనూ కనిపించారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.



