Prabhas’ Spirit Release Date Postponed

దసరా పండుగకు స్పిరిట్ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈఅప్‌డేట్‌తో దసరా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోబోతున్న డార్లింగ్ ఫాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. పాన్‌ ఇండియా స్టార్.. డార్లింగ్ ప్రభాస్.. డేరింగ్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమా వాయిదా(Prabhas’ Spirit Release Date Postponed) పడింది. సినిమా వాయిదా వేస్తున్నట్లు ఏకంగా డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగానే స్వయంగా ప్రకటించారు. దీంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్రాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో.. సమ్మర్ సీజన్‌లో నిలుస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశ కనిపించింది. సినిమా రిలీజ్‌ డేట్‌ను డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్‌గా తన ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ప్రభాస్‌ న్యూ లుక్‌తో కలిసి ఉన్నఫోటోతో కూడిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

ఆదివారం ఉదయం కొద్దిగసేపు ఎక్స్‌లో సందీప్‌రెడ్డి వంగా హడావుడి సృష్టించారు. ప్రభాస్ అన్న అభిమానులకు గుడ్ న్యూస్‌ అంటూ ఊరించారు. సరికొత్త రిలీజ్‌ డేట్‌తో కూడిన కొత్త పోస్టర్‌ను పరిచయం చేయబోతున్నానని చెప్పారు. చివరకు ప్రభాస్‌ సీరియస్ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 2027 అక్టోబర్ 29న దీపావళి ప్రపంచ వ్యాపంగా విడుదల విడుదల అవుతుందని ప్రకటించారు. వాస్తవానికి ఈసినిమా 2027 మార్చి 5న విడుదల చేయాలని భావించారు. సుమారు మారో 8 నెలలు వాయిదా(Prabhas’ Spirit Release Date Postponed) వేసి.. వచ్చే ఏడాది దీపావళి బరిలో నిలపాలని భావిస్తున్నారు.

స్పిరిట్ సినిమా తాజా రిలీజ్‌ డేట్‌పై మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నితీశ్‌ తివారీ డైరెక్షన్‌లో రణ్‌బీర్‌ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణ పార్ట్ 2. ఇది కూడా 2027 దీపావళికే రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్‌ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. అయితే స్పిరిట్ రిలీజ్‌ డే అనౌన్స్ కావడంతో వచ్చే ఏడాది దీపావళికి బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్‌ తప్పదని సిని వర్గాలు భావిస్తున్నాయి.
యానిమల్ సినిమాతో సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌లో తనకంటూ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. ఇటు ప్రభాస్, అటు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో స్పిరిట్ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈసినిమాలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. గుల్షన్‌ కుమార్ సమర్పణలో టీ-సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ బ్యానర్లపై ఈమూవీని నిర్మిస్తున్నారు.