HomePoliticsతెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ నుంచే నాంది

తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ నుంచే నాంది

Published on

తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌లోనే బీజం పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు అన్నారు. కరీంనగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలి. కరీంనగర్‌లో ఎన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామో చూడండి. కరీంనగర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎక్కడ చూసినా జలకళే కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే 50 ఏళ్లు వెనక్కి వెళ్తాం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పల్లెలు బాగుపడుతున్నాయి. గిరిజన తండాల్లో రోడ్లు వస్తున్నాయి. కరెంటు ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చాక పింఛన్‌ రూ.5 వేలు చేస్తాం. వెయ్యి గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మరోవైపు కరీంనగర్‌ నుంచి గెలిచిన ఎంపీ ఈ ఐదేళ్లలో ఏదైనా పని చేశారా? అని కేటీఆర్ బీజేపీ నేతల్ని నిలదీశారు.

Latest articles

More like this