HomeNewsఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసు ఈనెల 22కి వాయిదా

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసు ఈనెల 22కి వాయిదా

Published on

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో విచారణ వాయిదా పడింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. పీటీ వారెంట్‌పై ఒత్తిడి చేయబోమని ఏజీ చెప్పారు. గతంలో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

మరోవైపు రెండు గంటల పాటు చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఎల్వీప్రసాద్ ఆస్పత్రి నుంచి కాన్వాయ్‌లో టీడీపీ చీఫ్ ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు. చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు కంటికి శస్త్ర చికిత్స చేశారు. జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరుగగా.. ఈరోజు కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే.

Latest articles

More like this