HomeNewsతెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే

తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే

Published on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 55 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఏ క్షణమైనా తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. తొలి జాబితాలో ముగ్గురు ఎంపీలకు చోటు కల్పించినట్టు తెలుస్తోంది.. అంబర్‌పేట, ముషీరాబాద్ అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.. గజ్వేల్‌, హుజురాబాద్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేయనున్నట్టు సమాచారం.. తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు.. జనసేనకు కొన్ని సీట్లు కేటాయించనుంది బీజేపీ.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని రాష్ట్ర బీజేపీ కూడా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో జనసేనకు 7 నుంచి 10 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest articles

More like this