HomeNewsAndhra Pradeshఆత్మసాక్షి సర్వే.. ఆ పార్టీకి షాక్?టీడీపీ-జనసేన కి ఎన్నిసీట్లు వస్తాయంటే?

ఆత్మసాక్షి సర్వే.. ఆ పార్టీకి షాక్?టీడీపీ-జనసేన కి ఎన్నిసీట్లు వస్తాయంటే?

Published on

జగన్‌కు అసలు సిసలైన సర్వే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. టైమ్స్ నౌ సర్వేలో లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని వచ్చిన వార్తలు ఆ పార్టీ నేతల్ని ఖుషీగా మారిస్తే.. తాజాగా బయటకు వచ్చిన మరో సర్వే వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 100 శాతం నిజమైన ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు వచ్చే ఎన్నికలపై సర్వే ఫలితాలను బహిర్గతం చేసింది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తమ సర్వే ఫలితాల ద్వారా వెల్లడించింది. హైదరాబాద్‌ వేదికగా పనిచేస్తున్న ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీమ్ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో శాంపిళ్లు సేకరించి సర్వే నిర్వహించింది. ఈ మేరకు ఆత్మసాక్షి సర్వే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆత్మసాక్షి సర్వే నాలుగు ఫేజ్ ల్లో నిర్వహించింది. ఈ సర్వే గత ఏడాది సెప్టెంబర్ 3 నాడు నిర్వహించింది. ఈ మొదటి ఫేజ్ సర్వేలో మొత్తం లక్షా 37 వేల శాంపిల్స్ సేకరించారు. ఈ సర్వే ప్రకారం టీడీపీకి 77, వైసీపీకి 56, జనసేన పార్టీకి 4, ఇతరులకు సున్నాస్థానాలు వచ్చాయి. 38 నియోజకవర్గాల్లో తీవ్రమయిన పోటీ ఉంటుందని తేలింది. ఫేజ్ 2 సర్వే ప్రకారం ఫిబ్రవరి 17 నాటికి ఈ సర్వే పూర్తయింది. మూడ్ ఆఫ్ ఏపీ పేరిట 57,750 శాంపిల్స్ ద్వారా సర్వే చేసి ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రకారం వైసీపీకి 63 స్థానాలు, టీడీపీకి 78 స్థానాలు, జనసేనకు 7 స్థానాలు, 27 సీట్లలో హోరాహోరీ పోటీ ఉంటుందని తెలిపింది.

ఫేజ్ 3 సర్వే ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి సర్వే పూర్తయింది. జూలై 2 నుంచి 11 సెప్టెంబర్ వరకూ 6040 రేషియోలో శాంపిల్స్ ర్యాండమ్ గా సెలక్ట్ చేశారు. వివిధ వయసులకు చెందిన మహిళలు, పురుషుల నుంచి ఈ శాంపిల్స్ సెలక్ట్ చేశారు. ఈ సర్వేలో 15 విభాగాలకు చెందిన వారు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందులో రైతులు, కౌలు రైతులు, 18 నుంచి 35 ఏళ్ళు, 36-45ఏళ్ళు, 46 నుంచి అంతకంటే పెద్ద వయసు వారు ఉన్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేవారు, ఆశా,అంగన్ వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మత్స్యకారులు, చేనేతలు, నిర్మాణరంగంలో పనిచేస్తున్నవారు, చిరు వ్యాపారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ వారు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు, గ్రామ సర్పంచ్ లు, వివిధ పార్టీలకు చెందిన క్యాడర్, నిరుద్యోగ యువత, కాలేజీలు, విశ్వవిద్యాలయ విద్యార్ధులు ఉన్నారు.

ఆత్మసాక్షి సర్వే వివిధ రకాలుగా నిర్వహించింది. టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. అన్న ప్రాతిపాదికన ఆత్మసాక్షి సర్వే వివరాలను ప్రకటించింది. ఆప్షన్-1 ప్రకారం టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే.. టీడీపీకి 86, వైసీపీకి 68, జనసేనకు 6 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. 15 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని.. అయితే వీటిలో వైసీపీ 9, టీడీపీ 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.ఆప్షన్-2 ప్రకారం టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే టీడీపీకి 95 సీట్లు, జనసేనకు 13 సీట్లు వస్తాయని.. అప్పుడు వైసీపీ 60 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 7 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది.ఆప్షన్-3 ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీ లాభపడుతుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 70-75 సీట్లు మాత్రమే వస్తాయని.. వైసీపీకి 98-100 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. 7 స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉంటుందని అంచనా వేసింది.

ఆప్షన్-4 ప్రకారం టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. వీరి కూటమికి 115-122 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వైసీపీ 56-58 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని తెలిపింది. 4 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది.కాగా 2019 ఎన్నికల్లో ఆత్మసాక్షి సర్వే అక్షరాలా 95 శాతం నిజమైంది. వైసీపీ 139-142 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. టీడీపీ 22-28 స్థానాలకు పరిమితం అవుతుందని, జనసేనకు 0-2 సీట్లు మాత్రమే వస్తాయని గతంలో సర్వేలో వెల్లడించింది. వాస్తవ ఫలితాల ప్రకారం వైసీపీకి 151, టీడీపీకి 23 సీట్లు రాగా జనసేన ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది.

Latest articles

More like this